నిమ్స్‌లో ‘బయోటెక్ కోవాక్సిన్’ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలోని కరోనా పాజిటివ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. అందులోనూ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో భారత బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌పై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని నిమ్స్‌ ఆస్పత్రిలో..

  • Tv9 Telugu
  • Publish Date - 11:47 am, Tue, 7 July 20
నిమ్స్‌లో 'బయోటెక్ కోవాక్సిన్' క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలోని కరోనా పాజిటివ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. అందులోనూ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో భారత బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌పై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని నిమ్స్‌ ఆస్పత్రిలో నేటి నుంచి క్లీనికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. ఆరోగ్యంగా ఉండి ట్రయల్స్‌‌కు సమ్మతించిన వ్యక్తుల రక్త నమూనాలను సేకరిస్తున్నారు. వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించి వివిధ రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు నిమ్స్ ఆస్పత్రి సిబ్బంది. వీటన్నింటిలో సేఫ్ అని వచ్చిన ఆరోగ్యవంతులకు భారత బయోటెక్ కోవాక్సిన్ మొదటి డోస్ ఇస్తారు వైద్యులు. కాగా మొదటి డోస్ ఇచ్చిన తర్వాత రెండు రోజుల పాటు వ్యక్తిని పర్యవేక్షిస్తారు. ఇక మరో 14 రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తారు. ట్రయల్స్‌లో భాగంగా ఒక్కో వ్యక్తికి 3 డోసులు ఇవ్వనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ మనోహర్ వెల్లడించారు.

Read More:

శ్రీశైలం ఆలయంలో మొదటి కరోనా కేసు..

తెలంగాణ కొత్త సచివాలయ నమూనా విడుదల..

మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కన్నుమూత