AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్డేట్: దేశంలో 20 వేలు.. ప్రపంచవ్యాప్తంగా 5.40 లక్షల మరణాలు..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరింది. ఇందులో 2,59,557 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,39,948 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న ఒక్క రోజే వైరస్ బారిన పడి 467 మంది మృతి చెందటంతో మొత్తం […]

కరోనా అప్డేట్: దేశంలో 20 వేలు.. ప్రపంచవ్యాప్తంగా 5.40 లక్షల మరణాలు..
Ravi Kiran
|

Updated on: Jul 07, 2020 | 11:51 AM

Share

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరింది. ఇందులో 2,59,557 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,39,948 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న ఒక్క రోజే వైరస్ బారిన పడి 467 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు కరోనా వల్ల 20,160 మంది మరణించారు.

ఇదిలా ఉంటే దేశంలో ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రతరంగా ఉంది, మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు రెండు లక్షలు దాటగా.. తమిళనాడు, ఢిల్లీలలో కరోనా కేసులు లక్ష దాటాయి. అటు గుజరాత్‌లో 36,772 కేసులు నమోదు కాగా, ఉత్తరప్రదేశ్‌లో 28,636 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 25 వేలు దాటితే.. ఆంధ్రప్రదేశ్‌లో 20,019 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కాగా, కరోనా వైరస్ విజృంభణలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 11,747,381 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 540,836 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. అలాగే 6,741,701 మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో, బ్రెజిల్ రెండోస్థానంలో ఉన్నాయి.

Follow Us
కార్తీక పౌర్ణమి.. ఈ ఐదు పనులు తప్పక చేయండి.. శివకేశవుల అనుగ్రహం..
కార్తీక పౌర్ణమి.. ఈ ఐదు పనులు తప్పక చేయండి.. శివకేశవుల అనుగ్రహం..
ఆ హీరోతో ఓ సీన్‏లో స్విమ్‌సూట్‌లో కనిపించా..
ఆ హీరోతో ఓ సీన్‏లో స్విమ్‌సూట్‌లో కనిపించా..
ఎన్టీఆర్ సినిమా చూసి మహేష్ బాబు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
ఎన్టీఆర్ సినిమా చూసి మహేష్ బాబు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
రాజకీయ భవిష్యత్ కోల్పోతారు.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ
రాజకీయ భవిష్యత్ కోల్పోతారు.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
కార్తీక పౌర్ణమి రోజు చంద్రునికి నైవేద్యంగా పెట్టె పచ్చి చలిమిడి
కార్తీక పౌర్ణమి రోజు చంద్రునికి నైవేద్యంగా పెట్టె పచ్చి చలిమిడి
సౌందర్యను చూశాకే ఆ అలవాటు నేర్చుకున్నా.. హీరోయిన్ ఆమని..
సౌందర్యను చూశాకే ఆ అలవాటు నేర్చుకున్నా.. హీరోయిన్ ఆమని..
కేవలం రూ.12కే బంగారం.. సిల్వర్ రూ.15కే. జాక్‌పాట్ ఛాన్స్..
కేవలం రూ.12కే బంగారం.. సిల్వర్ రూ.15కే. జాక్‌పాట్ ఛాన్స్..
యువతను నాశనం చేస్తున్న విదేశీ శక్తులుః కిషన్‌రెడ్డి
యువతను నాశనం చేస్తున్న విదేశీ శక్తులుః కిషన్‌రెడ్డి
శీతాకాలంలో వచ్చే రోగాలన్నింటిని తరిమికొట్టే ఉసిరికాయ రసం..
శీతాకాలంలో వచ్చే రోగాలన్నింటిని తరిమికొట్టే ఉసిరికాయ రసం..