మొదలైన కోడి పందేల జోరు.. ఒక్కో పుంజు ధర తెలిస్తే..!

సంక్రాంతి పండుగకు సమయం దగ్గరపడుతోంది. దీంతో కోడి పందేల జోరు మొదలైంది. పలు చోట్ల కోడి పందేలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు పందెం రాయుళ్లు. మరోవైపు పందేల కోసం కుక్కట రాజభోగంతో దాదాపు ఏడాది పాటు పుంజులను పెంచిన యజమానులు.. ఇప్పుడు వాటిని అమ్మేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో పుంజులకు భారీ గిరాకీ ఏర్పడింది. జాతులను బట్టి ఒక్కోటి రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు ధర పలుకుతోంది. ఇక పండుగ దగ్గరకు వస్తుండంతో ఆ పుంజుల […]

మొదలైన కోడి పందేల జోరు.. ఒక్కో పుంజు ధర తెలిస్తే..!
Follow us

| Edited By:

Updated on: Jan 03, 2020 | 7:06 PM

సంక్రాంతి పండుగకు సమయం దగ్గరపడుతోంది. దీంతో కోడి పందేల జోరు మొదలైంది. పలు చోట్ల కోడి పందేలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు పందెం రాయుళ్లు. మరోవైపు పందేల కోసం కుక్కట రాజభోగంతో దాదాపు ఏడాది పాటు పుంజులను పెంచిన యజమానులు.. ఇప్పుడు వాటిని అమ్మేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో పుంజులకు భారీ గిరాకీ ఏర్పడింది. జాతులను బట్టి ఒక్కోటి రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు ధర పలుకుతోంది. ఇక పండుగ దగ్గరకు వస్తుండంతో ఆ పుంజుల పోషణలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు యజమానులు.

ముఖ్యంగా కైకలూరు ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ విస్తరించడంతో.. అక్కడ చెరువు గట్లపై పుంజులను పెంచడం హాబీగా పెట్టుకున్నారు కొందరు. ఇక పండుగ సమీపిస్తోన్న నేపథ్యంలో వాటిని మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఉదయం 6గంటలకే పుంజులను నీటిలో ఈత కొట్టించి వ్యాయమం చేయిస్తూ.. బాదం పప్పులు, నల్ల ద్రాక్ష, వెండి ఖర్జూరం, తాటి బెల్లం, నల్ల నువ్వులు కలిపిన నువ్వుల ఉండలు.. మటన్, జీడిపప్పు కలిపిన ఆహారం, సోళ్లు, సజ్జలు, వడ్లు, గుడ్లు.. ఇలా బలిష్టమైన తింటిని సమయానికి తగ్గట్లుగా వాటికి అందిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక్కో పుంజుకు రోజుకు రూ.200 దాకా ఖర్చు చేస్తున్నారు యజమానులు. ఇక ఇప్పుడు పండుగ దగ్గర పడుతుంటంతో వాటిని కొనుగోలు చేసేందుకు పలువురు చాలా ఆసక్తిని చూపుతున్నారు.