గులాబీ సిట్టింగులకు టెన్షన్.. సర్వే రిపోర్టు అదిరింది!

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గులాబీ నేతలకు టెన్షన్‌ పట్టుకుంది. టిక్కెట్‌ వస్తుందో రాదో అనే ఆందోళన వారిలో కన్పిస్తోంది. సగానికి పైగా సిట్టింగ్‌ల పని తీరు బాగోలేదని హైకమాండ్‌ సర్వేలో తేలింది. దీంతో సిట్టింగ్‌లకు టికెట్ల టెన్షన్‌ పట్టుకుంది. టికెట్లు రావని తెలిసి ఇతర పార్టీల నేతలతో టచ్‌లోకి వెళ్లాలని యోచిస్తున్నారట సిట్టింగ్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒక కార్పొరేషన్‌తో పాటు ఆరు మునిసిపాలిటీలను క్లీన్‌ స్వీప్‌ చేయాలనే టార్గెట్‌గా టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. […]

గులాబీ సిట్టింగులకు టెన్షన్.. సర్వే రిపోర్టు అదిరింది!
Follow us

|

Updated on: Jan 03, 2020 | 6:48 PM

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గులాబీ నేతలకు టెన్షన్‌ పట్టుకుంది. టిక్కెట్‌ వస్తుందో రాదో అనే ఆందోళన వారిలో కన్పిస్తోంది. సగానికి పైగా సిట్టింగ్‌ల పని తీరు బాగోలేదని హైకమాండ్‌ సర్వేలో తేలింది. దీంతో సిట్టింగ్‌లకు టికెట్ల టెన్షన్‌ పట్టుకుంది. టికెట్లు రావని తెలిసి ఇతర పార్టీల నేతలతో టచ్‌లోకి వెళ్లాలని యోచిస్తున్నారట సిట్టింగ్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒక కార్పొరేషన్‌తో పాటు ఆరు మునిసిపాలిటీలను క్లీన్‌ స్వీప్‌ చేయాలనే టార్గెట్‌గా టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాల కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసినట్లే..మునిసిపాలిటీల్లోనూ గులాబీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌, ఆర్మూరు, భీంగల్‌ మునిసిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇస్తుండగా… కామారెడ్డి, బోధన్‌, ఎల్లారెడ్డిలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ అన్నట్లుంది. బాన్సువాడలో ప్రతిపక్షాల ప్రభావం అంతంత మాత్రంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల గట్టి పోటీ ఉండడంతో.. గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న ఎమ్మెల్యేలు….అభ్యర్థులు ఎవరైతే బాగుంటుదనే అంశంపై ఇంటర్నల్‌ సర్వే చేపట్టారు. డివిజన్ల వారీగా, అభ్యర్థుల వారీగా ఈ సర్వే జరిగినట్లు తెలుస్తోంది.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, కామారెడ్డి మునిసిపాలిటీల్లో సగానికిపైగా సిట్టింగుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు పార్టీ ఇంటర్నల్‌ సర్వేలో తేలింది. తీవ్ర వ్యతిరేకత ఉన్న నేతలను పక్కన పెట్టి…వేరే వారికి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు సమాచారం.

సిట్టింగ్‌లకు రిజర్వేషన్లు అనుకూలంగా రాకుండా ఎమ్మెల్యేలు జాగ్రత్తపడుతున్నారట. దీంతో వారికి టికెట్‌కు చెక్‌ పెట్టవచ్చు. వారు వేరే పార్టీ తరపున పోటీ చేయకుండా చేయవచ్చు అనే ఆలోచన చేస్తున్నారట. మిగతా మునిసిపాలిటీల పరిస్థితి ఎలా ఉన్నా..నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మెజార్టీ సిట్టింగ్‌లకు టిక్కెట్లు దక్కే ఛాన్స్ లేదని ఆ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టిక్కెట్ల టెన్షన్‌ సిట్టింగ్‌లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో డివిజన్లు 60కి పెరిగాయి. సమీప 9 గ్రామాల విలీనంతో చాలా డివిజన్ల సరిహద్దులు మారాయి. దీంతో రిజర్వేషన్లు సైతం పూర్తిగా మారే అవకాశం ఉంది. ఇటు రిజర్వేషన్లు అనుకూలించక… అటు సర్వేలో అనుకూల ఫలితాలు రాకపోవడంతో సగం మంది సిట్టింగ్‌లు ఇప్పుడు ఆందోళనగా ఉన్నారు. అవసరమైతే పక్క పార్టీ లేకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్