మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మెదక్ పట్టణ శివారులో కారు బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. జగదీష్, అభిలాష్ అనే ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు విజయవాడకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. కారు అతివేగంగా వెళ్లడం వల్లే బోల్తా కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:17 am, Tue, 19 February 19
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మెదక్ పట్టణ శివారులో కారు బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. జగదీష్, అభిలాష్ అనే ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు విజయవాడకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. కారు అతివేగంగా వెళ్లడం వల్లే బోల్తా కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్నవారు జగదీష్ (35), అభిలాష్ (25) మృతి చెందారని పోలీసులు తెలిపారు.