Anakapalle: ఔరా..! పెన్సిల్ మొనపై పవళింపు గణపతి..! సూక్ష్మ కళాకారుడి అద్భుత కళాఖండం..

Anakapalle District: ఓంకారానికి వారసుడు.. ఆవిష్కరణ కారకుడు వినాయకుడు. ఆది దేవుడు విఘ్నేశ్వరుడిని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు కలగవంటారు. అందుకే ఆ స్వామిని ఎంత భక్తితో కొలిస్తే అంతటి ఆశీర్వాదాలు లభిస్తాయి అన్నది మన నమ్మకం, విశ్వాసం. అయితే  వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడుపై తన భక్తిని చాటి చెబుతూ అనకాపల్లి జిల్లాలో ఓ సూక్ష్మ కళాకారుడు అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. భారీ వినాయక విగ్రహాలు ప్రతిష్టించేందుకు పోటీ పడుతున్న సమయంలో.. ఏకంగా పెన్సిల్ మొనపై పవళింపు గణపతి సూక్ష్మ శిల్పాన్ని చెక్కి ఔరా అనిపించాడు.

Anakapalle: ఔరా..! పెన్సిల్ మొనపై పవళింపు గణపతి..! సూక్ష్మ కళాకారుడి అద్భుత కళాఖండం..
Miniature 'ganapathi' Art
Follow us
Maqdood Husain Khaja

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 18, 2023 | 9:18 AM

అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 18: ఓంకారానికి వారసుడు.. ఆవిష్కరణ కారకుడు వినాయకుడు. ఆది దేవుడు విఘ్నేశ్వరుడిని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు కలగవంటారు. అందుకే ఆ స్వామిని ఎంత భక్తితో కొలిస్తే అంతటి ఆశీర్వాదాలు లభిస్తాయి అన్నది మన నమ్మకం, విశ్వాసం. అయితే  వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడుపై తన భక్తిని చాటి చెబుతూ అనకాపల్లి జిల్లాలో ఓ సూక్ష్మ కళాకారుడు అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. భారీ వినాయక విగ్రహాలు ప్రతిష్టించేందుకు పోటీ పడుతున్న సమయంలో.. ఏకంగా పెన్సిల్ మొనపై పవళింపు గణపతి సూక్ష్మ శిల్పాన్ని చెక్కి ఔరా అనిపించాడు.

అనకాపల్లిజిల్లా నక్కపల్లి మండలం దొడ్డిగోలు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలు రూపొందించడం హాబీ. ప్రతిసారి.. సందర్భానికి అనుగుణంగా సమాజానికి ఒక చక్కని మెసేజ్ ఇస్తున్నాడు. అనేక మహానుభావులు, దేవతా మూర్తుల విగ్రహాలు పెన్సిల్‌పై చెక్కి చిన్న వస్తువులపై తనదైన శైలిలో ప్రత్యేకమైన శిల్పిగా పేరుగాంచాడు. సూక్ష్మ కళాకారులుగా ఖ్యాతి గడించాడు. వినాయక చవితి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరికివారు పోటాపోటీగా భారీ వినాయక విగ్రహాలు ప్రతిష్టించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయితే అనకాపల్లి జిల్లాలోని ఈ సూక్ష్మ కళాకారుడు భిన్నంగా ఆలోచించాడు. వినాయక చవితి సందర్భంగా అతి చిన్న శిల్పాన్ని రూపొందించాడు. వినాయకుడి పై భక్తితో పెన్సిల్ మొన పై అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. దాని పొడవు వెడల్పులంతా తెలుసా..? వెడల్పు పన్నెండు మిల్లీమీటర్లు, ఎత్తు నాలుగు మిల్లీమీటర్లు. సూక్ష్మ కళాఖండం చెక్కడానికి రెండు గంటల సమయం పట్టింది.

పవళింపు సేవలో తరిస్తున్నట్టు..

ముఖ్యంగా పవళింపు సేవలో తరిస్తున్నట్టు ఉంటున్నట్టు చెక్కిన ఆ విఘ్నేశ్వరుడు చిత్రం ఔరా అనిపిస్తుంది. తదేకంగా చూస్తే గాని.. పవళింపు వినాయకుడి రూపం సాక్షాత్కరించేలా చెక్కడు. వినాయక చవితి సందర్భంగా భక్తులందరికి ఈ సూక్ష్మ గణపతి విగ్రహం అంకితం చేసాడు వెంకటేష్. ఆ విఘ్న వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నాడు. పవళింపు వినాయకుడిని సూక్ష్మ కళాఖండంలో కళ్లకు కట్టినట్టు చెక్కిన వెంకటేష్ ప్రతిభను అభినందిస్తున్నారు భక్తులు. ఇప్పటికే వందల సంఖ్యలో సూక్ష్మ కళాఖండాల రూపొందించి అవార్డులు రివార్డులు రికార్డులు కూడా సొంతం చేసుకున్నాడు వెంకటేష్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?