Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Ganesha: ఆ మహిళ చేతిలో అద్భుత కళ.. గోటిపై ఇమిడిపోయేలా బుజ్జి గణపతి.. సహజ రంగులతో సుందర రూపం..

ఏటికొప్పాక గ్రామానికి చెందిన చింతల లావణ్య అనే కళాకారిణి.. గత కొంతకాలంగా లక్క బొమ్మలు తయారు చేయడం నేర్చుకుంది. కలపై ఉన్న మక్కువతో.. వందల బొమ్మలకు ప్రాణం పోసింది లావణ్య. అంతేకాదు పురుషులతో సమానంగా మహిళలు కూడా లక్క బొమ్మల తయారీలో రాణించాలని సంకల్పించింది. తాను నేర్చుకున్న కలను సాటి మహిళలకు నేర్పించి ఆదర్శంగా నిలుస్తోంది. 150 మంది మహిళలకు ఈ వృత్తిలో శిక్షణ ఇస్తుంది

Lord Ganesha: ఆ మహిళ చేతిలో అద్భుత కళ.. గోటిపై ఇమిడిపోయేలా బుజ్జి గణపతి.. సహజ రంగులతో సుందర రూపం..
Etikoppaka Ganesh
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Surya Kala

Updated on: Sep 18, 2023 | 1:58 PM

ఏటికొప్పాక లక్క బొమ్మలంటే.. వందల ఏళ్ల కాలం నాటి వాటి చరిత్ర కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. అంకుడు కర్రతో బొమ్మలను తయారు చేసి.. వాటికి సహజ సిద్ధ రంగులద్ది.. ప్రాణం పోస్తుంటారు అక్కడి కళాకారులు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆ కళాకారుల ప్రతిభ అద్దం పడుతొంది. అందుకే ఆ బొమ్మలు దేశ విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొందాయి. వాటిని చూసిన ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. దేశ ప్రధాని మనలో కూడా అందుకుంది ఆ బొమ్మలు. అంతేకాదు.. దశాబ్దాలుగా ఆ కళను నమ్ముకున్న ఓ కళాఖరుడికి పద్మశ్రీ అవార్డును సైతం ఆ బొమ్మలు తెచ్చిపెట్టాయి. వందలాది మంది కళాకారులు ఆ లక్క బొమ్మల పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అంటే.. దాని ప్రత్యేకత ఇక చెప్పనక్కర్లేదు.

కళకు పదును పెట్టేలా ఆ గణపయ్య..

ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామం హస్త కళాకారులకు నిలయం. ఏటికొప్పాక అనగానే ముచ్చట కొలపే లెక్క బొమ్మలు టక్కున గుర్తుకు వస్తుంటాయి. వంట చెరకుగా పనికిరాని అంకుడు కర్రతో అద్భుతమైన కళాఖండాలు తయారు చేయడం ఇక్కడ కళాకారుల ప్రతిభకు అద్దం పడుతూ ఉంటాయి. అంకుడు ఖరారు చేసిన అద్భుత కళాఖండాలకు లక్కతో ఫినిషింగ్ చేసి మెరిసేలా చేయడం ఇక్కడి బొమ్మల ప్రత్యేకత. వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి జిల్లా ఏడికొప్పాక లక్క బొమ్మల్లో బుజ్జి గణపయ్య ప్రాణం పోసుకున్నాడు. అది కూడా కేవలం అంగుళం ఎత్తు పరిమాణంలోనే. ఓ మహిళ కళాకారుని తన కళకు పదును పెట్టి.. బుజ్జి వినాయకుడికి ప్రాణం పోసింది. అంకుడు కర్రతో అద్భుతమైన బొజ్జ వినాయకుడి ప్రతిమను తయారుచేసి.. దానికి సహజ సిద్ధ రంగులద్దింది. లక్కతో ఫినిషింగ్ టచ్ ఇచ్చి.. గోటిపై ఇమిడిపోయేంత లా జీవం పోసింది.

ఏటికొప్పాక గ్రామానికి చెందిన చింతల లావణ్య అనే కళాకారిణి.. గత కొంతకాలంగా లక్క బొమ్మలు తయారు చేయడం నేర్చుకుంది. కలపై ఉన్న మక్కువతో.. వందల బొమ్మలకు ప్రాణం పోసింది లావణ్య. అంతేకాదు పురుషులతో సమానంగా మహిళలు కూడా లక్క బొమ్మల తయారీలో రాణించాలని సంకల్పించింది. తాను నేర్చుకున్న కలను సాటి మహిళలకు నేర్పించి ఆదర్శంగా నిలుస్తోంది. 150 మంది మహిళలకు ఈ వృత్తిలో శిక్షణ ఇస్తుంది. ఇప్పటికే లక్క బొమ్మల తయారీలో ఏటికొప్పాక ట్రేడ్ మార్క్ సంపాదించింది. అయితే ఈసారి వినాయక చవితికి.. బుజ్జి వినాయకుడిని తనకలతో జీవం పోయాలని సంకల్పించింది ఈ మహిళా కళాకారిణి. రెండు రోజుల పాటు శ్రమించి.. అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించింది లావణ్య. అంకుడు కర్రతో అంగుళం పొడవు, అర అంగుళం వెడల్పుతో.. బొమ్మను తయారుచేసి.. సహజ సిద్ధ రంగులను అద్దింది. ఈ వినాయక చవితికి ఏటికొప్పాక లక్క బొమ్మల్లో ఈ వినాయకుడు బొమ్మ ఒక ప్రత్యేకత చాటుకుంది. ఈ బొమ్మ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..