AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur Floods: కరువు సీమ అనంతపురం జిల్లాకు జలకళ.. రిజర్వాయర్ల వద్ద ప్రమాద హెచ్చరికల జారీ

కర్ణాటక నుంచి వేదావతి హగరికి మూడు వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.వంగపేరు నది ఉద్ధృతికి వంతెన కోతకు గురైంది. దీంతో ధర్మవరం-కొత్తచెరువు ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచి ఇబ్బంది ఏర్పడింది.

Anantapur Floods: కరువు సీమ అనంతపురం జిల్లాకు జలకళ.. రిజర్వాయర్ల వద్ద ప్రమాద హెచ్చరికల జారీ
Anantapur Floods And Rains
Surya Kala
|

Updated on: Aug 06, 2022 | 3:28 PM

Share

Anantapur Floods: సరిగ్గా ఐదు రోజుల క్రితం వరకు తీవ్ర వర్షాభావం.. కానీ నేడు ఎటూ చూసినా భారీ వర్షాలే.. పొంగిపోర్లుతున్న వాగులు వంకలే కనిపిస్తున్నాయి.. ఇది కరవు సీమ అనంతపురం జిల్లాలో కనిపిస్తున్న దృశ్యాలు. ఊహించని స్థాయిలో కురిసిన భారీ వర్షాలు జిల్లాను తడిసి ముద్దయ్యేలా చేస్తున్నాయి. మృత నదులుగా మారిన పెన్నా, చిత్రావతి, జయమంగళి నదులు పొంగిపొర్లుతున్నాయి. భగీరథ ప్రయత్నాలు చేసిన నిండని రిజర్వాయలు కేవలం వర్షం నీటితో నిండుతున్నాయి. ఏకంగా రిజర్వాయర్ల గేట్లు ఎత్తి వేస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.

అనంతపురం జిల్లాలో భైరవానతిప్ప ప్రాజెక్టు, పేరూరు అప్పర్‌పెన్నార్‌ డ్యామ్‌లు తొణికిసలాడుతున్నాయి. జిల్లాతో పాటు ఎగువన ఉన్న కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ఈ ప్రాజెక్టులకు పోటెత్తుతోంది. రామగిరి మండలంలోని పేరూరు అప్పర్‌పెన్నార్‌ డ్యామ్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. సుమారు 20 ఏళ్ల తరువాత ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదలడం ఇదే ప్రథమం. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 60 అడుగులు కాగా, 59 అడుగులకు నీరు చేరింది. భైరవానతిప్ప రిజర్వాయర్‌కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1655 అడుగులు కాగా.. శుక్రవారం సాయంత్రానికి 1654.8 అడుగులకు నీరు చేరుకుంది. ఇరిగేషన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా నాలుగు గేట్లను తెరిచి, వేదావతి హగరికి 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువ కింద చెరువులకు 150 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

కర్ణాటక నుంచి వేదావతి హగరికి మూడు వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.వంగపేరు నది ఉద్ధృతికి వంతెన కోతకు గురైంది. దీంతో ధర్మవరం-కొత్తచెరువు ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచి ఇబ్బంది ఏర్పడింది. ముదిగుబ్బ మండలంలోని మద్దిలేరు వాగు ఉద్ధృతితో కల్వర్టు కూలిపోయింది. తాడిపత్రి పట్టణ పరిసరాల్లోని పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు జలాశయంలో వరద నీరు ఎక్కువ చేరింది. దీంతో చాగల్లు నుంచి పెన్నానదిలోకి నీటిని వదిలారు.

ఇవి కూడా చదవండి

ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి ఉదృతంగా ప్రవహిస్తుంది. కోవెల గుట్ట పల్లి, రాయలవారి పల్లి, పుట్టపర్తి చెక్ డ్యాం ల పై చిత్రావతి నది పరువల్లు తొక్కుతోంది. కోవెలగుట్టపల్లి, రాయలవారిపల్లి గ్రామాలకు పూర్తిగా రాక పొకలు బంద్ అయ్యాయి. రెండు గ్రామాలు నది ఆవతలి వైపు ఉండడంతో మౌలిక సదుపాయాలు అందక పోవడంతో ఆ రెండు గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్రావతి నది పరువల్లు తిలకించడానికి అత్యధిక సంఖ్యలో ప్రజలు నది ఒడ్డుకు చేరుకున్నారు. సత్య సాయి జిల్లాలో అతిపెద్ద చెరువు అయిన బుక్కపట్నం చెరువు పూర్తికా నిండుకొని నీటితో తొనికిసలాడుతోంది. రాత్రికి పూర్తిగా నిండుకొని మరువపారనుంది. జోరు వర్షాలతో నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు,వంకలు పొంగి పొర్లుతూ చెరువులు నిండి జలను సంతరించుకుంది. మరోవైపు ధర్మవరం చెరువుకు పెద్ద ఎత్తున నీరు చేరడంతో 7మరవలు పారుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉద్యాన పంటలతో పాటు పత్తి, వేరు సెనగ, మొక్కజొన్న, కంది వంటి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు ఉద్యాన పంటలకు మాత్రమే పంటనష్టాన్ని గుర్తించి నివేదికలు పంపుతున్నారు. సుమారు 800 హెక్టార్లలో రూ.5.63 కోట్లు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసి పంపారు. వ్యవసాయ పంటలకు నష్టం అంచనా వేయడం లేదు. మరోవైపు భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో కల్వర్టులు కొట్టుకుని పోతున్నాయి. నదులు దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఘెర ప్రమాదం జరిగింది. పేరూరు ప్రాజెక్ట్ కు నీటి ప్రవాహం ఎక్కువ ఎక్కువగా ఉండటంతో గేట్లెత్తి నీటిని కిందకు వదిలారు. పెన్నా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం చూసేందుకు వెళ్లిన మహిళలు ప్రమాదానికి గురవుతున్నారు. ఇలా జిల్లాలో ఎటు చూసిన జల కళే కనిపిస్తోంది. ప్రత్యేకించి రిజర్వాయర్ల వద్ద ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Reporter: Kanth, TV9 Telugu