Balineni: వైసీపీలో కొలిక్కివచ్చిన ప్రకాశం సీట్ల పంచాయితీ.. గిద్దలూరులో పోటీకి బాలినేని శ్రీనివాసరెడ్డి
ప్రకాశం జిల్లా వైసీపీలో నెలకొన్న పంచాయితీ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో మాజీమంత్రి బాలినేని కేంద్రంగానే ఎక్కువగా వైసీపీ రాజకీయాలు జరుగుతుంటాయి. ఈసారి బాలినేనిని ఒంగోలుకు బదులుగా గిద్దలూరు నుంచి పోటీ చేయించాలని పార్టీ నాయకత్వం భావిస్తుండటం.. అందుకు ఆయన ఒప్పుకోవడం లేదనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది.
![Balineni: వైసీపీలో కొలిక్కివచ్చిన ప్రకాశం సీట్ల పంచాయితీ.. గిద్దలూరులో పోటీకి బాలినేని శ్రీనివాసరెడ్డి](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/12/balineni-srinivas.jpg?w=1280)
ప్రకాశం జిల్లా వైసీపీలో నెలకొన్న పంచాయితీ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో మాజీమంత్రి బాలినేని కేంద్రంగానే ఎక్కువగా వైసీపీ రాజకీయాలు జరుగుతుంటాయి. ఈసారి బాలినేనిని ఒంగోలుకు బదులుగా గిద్దలూరు నుంచి పోటీ చేయించాలని పార్టీ నాయకత్వం భావిస్తుండటం.. అందుకు ఆయన ఒప్పుకోవడం లేదనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది.
అయితే తాజాగా బాలినేనిని ఒప్పించే విషయంలో వైసీపీ నాయకత్వం సక్సెస్ అయ్యిందని తెలుస్తోంది. గిద్దలూరు నుంచి పోటీ చేసేందుకు అంగీకరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఇందుకోసం కొన్ని షరతులు పెట్టారని తెలుస్తోంది. తాను గిద్దలూరు నుంచి పోటీ చేస్తానని.. అయితే పలు సీట్లలో తాను సూచించిన వ్యక్తులకే టికెట్లు ఇవ్వాలని ఆయన పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్టు వార్తలు వినిపించాయి.
సంతనూతలపాడులో తాను సూచించిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారని.. ఇందుకు వైసీపీ నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇక బాలినేని స్థానంలో ఒంగోలు నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కూడా వైసీపీ అధిష్ఠానం ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.
సిద్ధా రాఘవరావు లేదా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌లో ఒకరికి ఒంగోలు సీటు ఇవ్వనున్నారని సమాచారం. వీరిలో ఒకరికి ఎమ్మెల్యే సీటు మరొకరికి ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చేందుకు వైసీపీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులు చేస్తున్న సీఎం జగన్.. ఇదే క్రమంలో ప్రకాశం పంచాయితీకి కూడా ముగింపు పలకబోతున్నారని తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…