Andhra Pradesh: కార్మికులను చిదిమేసిన గ్రానైట్ రాళ్లు.. బాపట్ల జిల్లాలో ఘోరం

బాపట్ల(Bapatla) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్లు మీద పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. బల్లికురవ మండలం వల్లాపల్లికి చెందిన షేక్ పెద్ద హిమాంస, షేక్ చిన్న హిమాంస.. మార్టూరు మండలంలోని ఇసుకదర్శి...

Andhra Pradesh: కార్మికులను చిదిమేసిన గ్రానైట్ రాళ్లు.. బాపట్ల జిల్లాలో ఘోరం
Crime
Follow us

|

Updated on: Jun 15, 2022 | 5:33 PM

బాపట్ల(Bapatla) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్లు మీద పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. బల్లికురవ మండలం వల్లాపల్లికి చెందిన షేక్ పెద్ద హిమాంస, షేక్ చిన్న హిమాంస.. మార్టూరు మండలంలోని ఇసుకదర్శి సమీపంలోని ఓ గ్రానైట్ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో పని చేస్తుండగా గ్రానైట్ రాయిని మిషన్​తో కోసే క్రమంలో బండరాయి ఇద్దరి మీద పడింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి కార్మికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి వైద్యులు అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాయాకష్టం చేసుకుని బతుకీడుస్తున్న ఆ కుటుంబాల్లోని వారు మృతి చెందడంతో మృతుల కుటుంబీకులు బోరున విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

కాగా జిల్లాలో గ్రానైట్‌, మెటల్‌ క్వారీలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో పెద్ద ఎత్తున గ్రానైట్‌ క్వారీలు ఉన్నాయి. వీటి వల్ల కార్మికులకు ఉపాధి లభిస్తున్నప్పటికి వారి ప్రాణాలకు మాత్రం భద్రత లేకుండా పోతోంది. గ్రానైట్‌ క్వారీలను లోతుగా తవ్వి అనంతరం వాటిని పూడ్చివేసే విషయం గాలికి వదిలేస్తున్నారు. దీంతో క్వారీ గుంతలలోకి వెళ్లిన వారు ప్రమాదవశాత్తు మృతి చెందుతున్నారు. క్వారీలలో పనిచేసే కార్మికులలో అత్యధిక శాతం వేరే రాష్ట్రాలకు చెందిన వారు కావడం తో మృతిచెందిన సమయంలో నిర్వాహకులు వారి కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థిక సహాయం ముట్ట జెప్పి బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..