TTD: ఎట్టకేలకు వెంకన్న భక్తుల చేతికి చేతి కర్ర.. ఆ మార్గంలో ఇక చిరుత భయం లేనట్లేనా?
అలిపిరి నడక మార్గం వద్ద నడిచి వెళ్ళే భక్తులకు టిటిడి ఈ రోజు నుంచి ఊత కర్రల పంపిణీ ప్రారంభించింది. టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈఓ ధర్మారెడ్డి భక్తులకు చేతి కర్రలను అందచేయగా నరసింహ స్వామి ఆలయం వద్ద టిటిడి సిబ్బంది తిరిగి స్వాధీనం తీసుకోకుంటోంది. చేతిలో కర్ర ఉంటే జంతువులు రావని శాస్త్రీయ వాదనగా భావిస్తున్న టిటిడి మెట్ల మార్గంలో టిటిడి..
తిరుపతి, సెప్టెంబర్ 6: అలిపిరి నడక మార్గం వద్ద నడిచి వెళ్ళే భక్తులకు టిటిడి ఈ రోజు నుంచి ఊత కర్రల పంపిణీ ప్రారంభించింది. టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈఓ ధర్మారెడ్డి భక్తులకు చేతి కర్రలను అందచేయగా నరసింహ స్వామి ఆలయం వద్ద టిటిడి సిబ్బంది తిరిగి స్వాధీనం తీసుకోకుంటోంది. చేతిలో కర్ర ఉంటే జంతువులు రావని శాస్త్రీయ వాదనగా భావిస్తున్న టిటిడి మెట్ల మార్గంలో టిటిడి భద్రత సిబ్బంది అందుబాటులో ఉంటుందని భరోసా ఇస్తోంది. చేతి కర్ర ఇచ్చి తమ పని అయిపోయిందను కోవడం లేదని నడిచి వెళ్ళే భక్తులు కు ఆత్మ విశ్వాసం చేతి కర్రతో పెరుగుతోందన్నది టిటిడి అభిప్రాయం.
అలిపిరి నడకమార్గంలో క్రూరమృగాల సంచారంతో అనేక భద్రతా చర్యలు తీసుకున్న టిటిడి ఇందులో బాగంగా భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి చేతికర్రలు అందజేస్తున్నట్లు టీటీడీ ధరక్మర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అలిపిరి పాదాల మండపం వద్ద ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ భక్తులకు చేతికర్రలను అందజేశారు. చేతికర్రలతో భక్తులు క్రూరమృగాలతో పోరాడాలని కాదని, చేతిలో కర్ర ఉంటే ఏ జంతువైనా వెనకాడుతుందని శాస్త్రీయ పరిశీలన ద్వారా రుజువైందని భూమన కరుణాకర్ రెడ్డి. వేల ఏళ్ల నుంచే గ్రామాల్లో ప్రజలు పొలాలకు, అడవులకు వెళ్లేటప్పుడు చేతికర్రలను ఆసరాగా తీసుకెళ్లడం జరుగుతోందన్నారు. యాత్రికులకు చేతి కర్రను ఇచ్చి టీటీడీ బాధ్యత తీరినట్టు భావించడం లేదన్నారు. భక్తులను గుంపులుగా పంపుతున్నామని, సెక్యూరిటీ గార్డు భక్తులు భద్రతగా ఉంటారని, అక్కడక్కడ పోలీసు సిబ్బంది కూడా రక్షణగా ఉంటారన్నారు. టీటీడీ చేపట్టిన చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతంలో బోనులు ఏర్పాటుచేసి ఇప్పటివరకు నాలుగు చిరుతలను బంధించామన్నారు.
కర్రల పంపిణీకి సంబంధించి విమర్శలు చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్న భూమన చేతికర్రలను భక్తులకు ఉచితంగా అందిస్తామన్నారు. అలిపిరిలో చేతి కర్రలు అందజేసి శ్రీ నరసింహస్వామివారి ఆలయం వద్ద తిరిగి తీసుకుంటామన్నారు భూమన. జులై 2న ఏడో మైలు వద్ద, ఆగస్టు 12న నరసింహస్వామివారి ఆలయం వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో నడక మార్గంలో భక్తుల భద్రత దృష్ట్యా అనేక చర్యలు చేపట్టామన్నారు టిటిడి ఇఓ ధర్మా రెడ్డి. 500 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటుచేసి నిత్యం అడవి జంతువుల సంచారాన్ని గుర్తించి వాటిని బందిస్తున్నామని, నడక మార్గం వైపు రాకుండా తగిన చర్యలు చేపడుతున్నామన్నారు ఈవో ధర్మారెడ్డి. భక్తులు సాధు జంతువులకు ఆహారం వేయకుండా పండ్ల విక్రయాలను నిలిపివేశామని, ఈ కారణంగా సాధు జంతువుల కోసం క్రూరమృగాలు రావడం లేదన్నారు ప్రస్తుతం తిరుమల శిలాతోరణం వద్ద, ఏడో మైలు వద్ద చిరుతల సంచారాన్ని గుర్తించామన్నారు.
ఈ నేపథ్యంలో గాలిగోపురం నుండి వంద మంది భక్తులను గుంపులుగా గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్లాలని సూచిస్తున్నామని, ప్రతి 5 నిమిషాలకోసారి బ్రాడ్ కాస్టింగ్ ద్వారా అటవీ జంతువుల సంచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల నుంచి గురించి సమాచారాన్ని తెలియజేస్తున్నామని వివరించారు. భక్తుల భద్రత కోసం అటవీశాఖ ప్రత్యేకంగా వందమంది సిబ్బందిని నియమించుకుందన్నారు ఈఓ ధర్మారెడ్డి.
ప్రస్తుతం 12 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నామని, ఘాట్ రోడ్లలో ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తున్నామన్నారు ఈవో ధర్మారెడ్డి. అలిపిరి నడక మార్గం రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందని, ఇక్కడ ఇనుప కంచె వేయడానికి కేంద్ర అటవీ శాఖకు, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపామని, వారు తగిన డిజైన్లతో అంగీకారం తెలిపితే కంచె నిర్మిస్తామన్నారు. చేతికర్రల కోసం అడవిని నాశనం చేయడం లేదన్నారు ధర్మారెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.