- Telugu News Photo Gallery Vijayawada: Cyber criminals stolen RS 4 lakh 35 thousand from house owner with tolet board in Kanur
Vijayawada: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు.. టూలెట్ బోర్డుతో 4 లక్షల 35 వేలు పోగొట్టుకున్న ఇంటి యజమాని! ఎలాగంటే..
ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా కూడా మోసం చేస్తారా అనిపించేలా రకరకాల మార్గాల్లో పబ్లిక్ కు టోకరా పెట్టి వారి ఖాతాలకు చిల్లు పెడుతున్నారు. ఇక తాజాగా విజయవాడలో olxలో ఇళ్ళు అద్దెకు ఇవ్వబడును అంటూ టూలేట్ బోర్డు పెట్టిన ఓ ఇంటి యజమాని నుండి ఏకంగా 4 లక్షల 35 వేలు దోచేశారు ఎలానో మీరే చుడండి..
Updated on: Sep 06, 2023 | 9:42 PM

ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా కూడా మోసం చేస్తారా అనిపించేలా రకరకాల మార్గాల్లో పబ్లిక్ కు టోకరా పెట్టి వారి ఖాతాలకు చిల్లు పెడుతున్నారు.

ఇక తాజాగా విజయవాడలో olxలో ఇళ్ళు అద్దెకు ఇవ్వబడును అంటూ టూలేట్ బోర్డు పెట్టిన ఓ ఇంటి యజమాని నుండి ఏకంగా 4 లక్షల 35 వేలు దోచేశారు ఎలానో మీరే చుడండి..

విజయవాడలోని కానూరుకు చెందిన సత్యనారాయణ తనకున్న ఫ్లాట్ ను అద్దెకు ఇవ్వాలని నిర్ణనించుకుని ఐజీ గా ఉంటుందని olxలో ఇళ్ళు అద్దెకు ఇవ్వబడును అంటూ టూ లెట్ బోర్డు పెట్టాడు. టూ లెట్ బోర్డు పెట్టిన కొద్దీ రోజులకే నేను ఆర్మీ ఆఫీసర్ ను అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసాడు.

ఇళ్ళు అద్దెకు కావాలంటూ ఫోన్ చేసి ఇళ్ళు ఫోటో లు పెట్టమన్నాడు అది నమ్మిన ఇంటి యజమాని వెంటనే ఫోటోలు తీసి అతనికి పెట్టాడు. ఇళ్ళు నచ్చింది అద్దెకు వస్తా అడ్వాన్స్ ఇస్తా అంటూ యజమాని అకౌంట్ నే హ్యాక్ చేసి అతని అకౌంట్ నే కాళీ చేసాడు.

అడ్వాన్స్ డబ్బులు వెయ్యటానికి అకౌంట్ నంబర్ లేదని చెప్పటంతో ఫోన్ పే ఓపెన్ చెయ్యమని చెప్పాడు. ఆలా ఫోన్ పే ఓపెన్ చేసిన కొద్దిసేపటికి అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం కాళీ అయింది. ఎలాంటి ఓటీపీ చెప్పకుండా డిటైల్స్ ఇవ్వకుండా డబ్బులు పోవటంతో పోలీసులని ఆశ్రయించాడు. దీనిపై కేస్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
