- Telugu News Photo Gallery Cinema photos Vijay deverakonda helps his fans by donating amount and leo movie shooting done in chilling cold jammu and kashmir
అభిమానులకు అండగా విజయ్ దేవరకొండ.. ఎముకలు కొరికే చలిలో లియో
ఖుషి సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు హీరో విజయ్ దేవరకొండ. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న విజయ్ కీలక ప్రకటన చేశారు. తన రెమ్యూనరేషన్ నుంచి కోటీ రూపాయలను అభిమానుల కుటుంబాలకు ఆర్ధిక సాయంగా అందిస్తున్నట్టుగా ప్రకటించారు. 100 కుటుంబాలకు లక్ష రూపాలయ చొప్పున ఈ సాయం అందించనున్నారు. లియో సినిమా షూటింగ్ కోసం రిస్క్ చేశారు హీరో విజయ్. కశ్మీర్ షెడ్యూల్‌లో మైనస్ 10 డిగ్రీల టెంపరేచర్ కండిషన్‌లో కేవలం టీషర్ట్‌తో షూటింగ్‌లో పాల్గొన్నారు.
Phani CH | Edited By: Ravi Kiran
Updated on: Sep 06, 2023 | 9:43 PM

Vijay Deverakonda: ఖుషి సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు హీరో విజయ్ దేవరకొండ. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న విజయ్ కీలక ప్రకటన చేశారు. తన రెమ్యూనరేషన్ నుంచి కోటీ రూపాయలను అభిమానుల కుటుంబాలకు ఆర్ధిక సాయంగా అందిస్తున్నట్టుగా ప్రకటించారు. 100 కుటుంబాలకు లక్ష రూపాలయ చొప్పున ఈ సాయం అందించనున్నారు.

Leo: లియో సినిమా షూటింగ్ కోసం రిస్క్ చేశారు హీరో విజయ్. కశ్మీర్ షెడ్యూల్‌లో మైనస్ 10 డిగ్రీల టెంపరేచర్ కండిషన్‌లో కేవలం టీషర్ట్‌తో షూటింగ్‌లో పాల్గొన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా లియో. విజయ్‌కి జోడిగా త్రిష నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ రోజు నుంచి రెజ్యూమ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. డైరెక్టర్ హరీష్ శంకర్ ఆయుధాలతో దిగిన ఫోటోను షేర్ చేసి, యాక్షన్ సీన్ చిత్రీకరణ జరగబోతుందన్న క్లారిటీ ఇచ్చింది.

Salaar: సలార్ రిలీజ్ డేట్ విషయంలో డైలమా కొనసాగుతోంది. రిలీజ్ వాయిదా పడుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు. తాజాగా సలార్ అఫీషియల్ ట్విటర్ పేజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌కు సంబంధించిన అప్‌డేట్ షేర్ చేయటంతో వాయిదా వార్తలు రూమర్సేనా అన్న అనుమానం కలుగుతోంది.

Aha: మరో ఇంట్రస్టింగ్ షోకు రెడీ అవుతోంది అచ్చ తెలుగు ఓటీటీ ఆహా. మాస్ స్టార్ విశ్వక్‌సేన్ తొలిసారిగా హోస్ట్ చేస్తున్న షో ఫ్యామిలీ ధమాకా, ఈ నెల 8 నుంచి స్ట్రీమ్ కానుంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా టీమ్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్మెంట్‌తో కట్ చేసిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.





























