- Telugu News Photo Gallery Cinema photos TV serial actress Keerthy Bhat Latest Beautiful saree photos goes viral telugu movie news
Keerthi Bhat: ఏముందండి బాబు అమ్మాయి.. కీర్తిని ఇలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. బ్యూటిఫుల్ లుక్స్..
బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు కీర్తి భట్. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ కు పరిచయమైంది కీర్తి. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ హిమ పాత్రలో నటించి మరింత దగ్గరయ్యింది. ప్రస్తుతం మధురానగరిలో సీరియల్లో నటిస్తుంది కీర్తిభట్. నటిగా కాకుండా బిగ్ బాస్ సీజన్ 6 ఫైనలిస్ట్‌గా నిలిచి మరింత పాపులారిటి సొంతం చేసుకుంది. కారు ప్రమాదంలో మొత్తం కుటుంబాన్ని కోల్పోయి అనాధగా మారింది. అమ్మ, నాన్న, అన్న, వదిన, అన్న పిల్లలు అందరిని పోగొట్టుకుని.. తీవ్రగాయాలతో బతికింది.
Updated on: Sep 06, 2023 | 9:40 PM

బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు కీర్తి భట్. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ కు పరిచయమైంది కీర్తి. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ హిమ పాత్రలో నటించి మరింత దగ్గరయ్యింది.

ప్రస్తుతం మధురానగరిలో సీరియల్లో నటిస్తుంది కీర్తిభట్. నటిగా కాకుండా బిగ్ బాస్ సీజన్ 6 ఫైనలిస్ట్‌గా నిలిచి మరింత పాపులారిటి సొంతం చేసుకుంది.

కారు ప్రమాదంలో మొత్తం కుటుంబాన్ని కోల్పోయి అనాధగా మారింది. అమ్మ, నాన్న, అన్న, వదిన, అన్న పిల్లలు అందరిని పోగొట్టుకుని.. తీవ్రగాయాలతో బతికింది. చాలా కాలం కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడింది.

ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. జీవితంలో ప్రతి క్షణం పోరాడి గెలిచింది. ఇప్పటివరకు ఓ అనాధగా ఒంటరిగా ఉన్న కీర్తి ఇప్పుడు ఓ ఇంటి కోడలైంది. కన్నడ నటుడు కార్తీక్.. కీర్తిని మనస్పూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.

వీరిద్దరి నిశ్చితార్థం ఆగస్ట్ 20న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బుల్లితెర నటీనటుులు హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో కీర్తి షేర్ చేసే ప్రతి చిన్న పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. తాజాగా చిలకపచ్చ చీరలో కీర్తి చేసిన ఫోటోస్ ఇప్పుడు వైరలవుతున్నాయి.




