Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children’s Hospital: రెండేళ్లలో 2 వేలకు పైగా గుండె ఆపరేషన్లు.. ఎక్కడంటే..

ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లల కోసం ఆసుపత్రి ఉండాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ 2021 అక్టోబరులో ఈ ఆసుపత్రిని ప్రారంభించార‌న్నారు ధర్మారెడ్డి. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 15 మంది వైద్య బృందం, నర్సుల బృందం కలిసి ఎంతో అంకితభావంతో రోగుల‌కు సేవలు అందిస్తున్నారని చెప్పారు ధర్మారెడ్డి.

Children's Hospital: రెండేళ్లలో 2 వేలకు పైగా గుండె ఆపరేషన్లు.. ఎక్కడంటే..
Sri Padmavati Children's hospital
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Nov 09, 2023 | 6:58 AM

తిరుపతిలోని టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో మెరుగైన వైద్య‌సేవ‌లు అందిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో రెండేళ్ల వ్య‌వ‌ధిలో రికార్డు స్థాయిలో 2,030 గుండె శస్త్ర చికిత్సలు పూర్తి చేసింది టీటీడీ. ఎనిమిది మందికి గుండె మార్పిడి శ‌స్త్ర చికిత్సలను కూడా చేసింది. ఇందులో ఏడు విజయవంతం కాగా గుండె మార్పిడి చేసుకున్న వారంతా ఆరోగ్యంగా ఉన్నారన్నారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి.

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో గుండె ఆపరేషన్లు చేసుకుని చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఈవో మీడియా తో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లల కోసం ఆసుపత్రి ఉండాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ 2021 అక్టోబరులో ఈ ఆసుపత్రిని ప్రారంభించార‌న్నారు ధర్మారెడ్డి. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 15 మంది వైద్య బృందం, నర్సుల బృందం కలిసి ఎంతో అంకితభావంతో రోగుల‌కు సేవలు అందిస్తున్నారని చెప్పారు ధర్మారెడ్డి. శ‌స్త్రచికిత్స‌ల్లో 95 శాతం సక్సెస్ రేట్ ఉందని సేవలకు గుర్తింపుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ఆసుపత్రిగా అవార్డు కూడా లభించిందని తెలిపారు.

ఆరోగ్యశ్రీ తో పాటు కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ కింద ఉచితంగా శ‌స్త్రచికిత్స‌లు నిర్వహిస్తున్నట్లు ధర్మారెడ్డి చెప్పారు. రోజుల వయసుగల పిల్లల నుంచి పెద్దల వరకు సంక్లిష్టమైన గుండె సమస్యలకు నిపుణులైన వైద్య బృందంతో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి. ఎక్కువ ఖ‌ర్చుతోకూడిన హైరిస్క్ ఆపరేషన్లకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్, ఎస్వీ ప్రాణదాన ట్రస్టు కింద‌ పేదలకు ఉచితంగా గుండెవైద్యం అందిస్తున్నామన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా నరం ద్వారా క‌వాటాలు మార్చడం, ధమనుల శ‌స్త్రచికిత్సలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో 350 పడక‌లతో సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం పూర్తి కానుంద‌ని, కిడ్నీ, మెద‌డు, బోన్‌మ్యారో లాంటి చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని విభాగాలకు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంటుందని  ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..