Diwali 2023: దీపావళిని జరుపుకునే విషయంలో అయోమయం.. పండితులు ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే?..

అమావాస్య నవంబర్ 12, 2023న మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే దీపావళి వరస.. అమావాస్య చీకట్లు పోగొట్టి.. వెలుగుని పంచె విధంగా సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తారు. దీంతో అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.

Diwali 2023: దీపావళిని జరుపుకునే విషయంలో అయోమయం.. పండితులు ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే?..
Diwali 2023
Follow us
Surya Kala

|

Updated on: Nov 09, 2023 | 6:44 AM

గత కొంత కాలంగా హిందువుల పండగలు జరుపుకునే విషయంలో వివాదం నెలకొంటుంది. పండగ తిథులు తగులు, మిగులుగా రెండు రోజులు వస్తూ ఉండడంతో ఏ రోజున పండగ జరుపుకోవాలనే విషయంలో గందరగోళం నెలకొంటునే ఉంది. తాజా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా, కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే దీపావళి పండుగ తేదీపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 12న జరుపుకోవాలా లేదా 13న జరుపుకోవాలా అనే విషయంలో కన్ఫ్యూజన్‌ ఉంది. సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలోని ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండగను జరుపుకుంటారు. అయితే అధికమాసం కారణంగా దాదాపుగా అన్ని పండుగలు రెండు రోజులు వచ్చాయి. అమావాస్య తిథి కూడా రెండు రోజులు రావడంతో దీపావళి పండగను ఏ రోజు జరుపుకోవాలనే విషయంలో అయోమయం ఏర్పడింది.

అమావాస్య నవంబర్ 12, 2023న మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే దీపావళి వరస.. అమావాస్య చీకట్లు పోగొట్టి.. వెలుగుని పంచె విధంగా సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తారు. దీంతో అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలని.. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు పండితులు. అయితే నవంబర్‌13న మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆరోజు వైదిక క్రతువులు నిర్వహించుకోవచ్చని సూచిస్తున్నారు. దీపదానాలు, యమ తర్పణాలు చేయడానికి సోమవారం వీలుంటుందని, ఆరోజు వైదిక దీపావళిగా పండగను జరుపుకోవచ్చన్నారు పండితులు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నెల 13వ తేదీన పబ్లిక్ హాలిడే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 11 రెండో శనివారం, 12న ఆదివారం, 13న దీపావళి కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత మర్నాడు రాక్షసుడి పెట్టే కష్టాల నుంచి విముక్తి కలిగిందనే ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ పండుగ జరపుకుంటారు. కుటుంబసభ్యులు, బంధువులందరూ కలిసి దీపావళి పండుగను ఎంజాయ్ చేస్తారు. ఇంటింటా దీపాలు వెలిగిస్తారు. దీంతో దేశమంతటా వెలుగులు విరజిమ్ముతాయి. దీపావళి పండుగ రోజు లక్ష్మిదేవిని పూజిస్తే మంచి జరుగుతుందనే నమ్మకం ఉండటంతో చాలామంది లక్ష్మిదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు