AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirituality Tips: దీపావళి పండుగ రోజు ఈ మొక్కలను ఇంటికి తీసుకొస్తే.. అదృష్టం వరిస్తుంది!

దీపావళి పండుగ అంటే పెద్దలకు అయినా, చిన్న పిల్లలకు అయినా ఎంతో ఇష్టం. చిన్న పిల్లలు అయితే ముఖ్యంగా ఈ పండుగ కోసం ఏడాది అంతా వెయిట్ చేస్తూంటారు. వారికి ఇష్టమైన పండుగల్లో ఇది కూడా ఒకటి కాబట్టి. అయితే దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడం, ఇంటిని అందంగా దీపాలతో అలంకరించుకోవడం, టపాసులు కాల్చడం వంటివి చేస్తూంటారు. అయితే ఇంకొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం కూడా కలసి వస్తుందట. కొన్ని రకాల మొక్కలను దీపావళి..

Spirituality Tips: దీపావళి పండుగ రోజు ఈ మొక్కలను ఇంటికి తీసుకొస్తే.. అదృష్టం వరిస్తుంది!
Tulsi Plant
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 11, 2023 | 9:59 PM

Share

దీపావళి పండుగ అంటే పెద్దలకు అయినా, చిన్న పిల్లలకు అయినా ఎంతో ఇష్టం. చిన్న పిల్లలు అయితే ముఖ్యంగా ఈ పండుగ కోసం ఏడాది అంతా వెయిట్ చేస్తూంటారు. వారికి ఇష్టమైన పండుగల్లో ఇది కూడా ఒకటి కాబట్టి. అయితే దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడం, ఇంటిని అందంగా దీపాలతో అలంకరించుకోవడం, టపాసులు కాల్చడం వంటివి చేస్తూంటారు. అయితే ఇంకొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం కూడా కలసి వస్తుందట. కొన్ని రకాల మొక్కలను దీపావళి పండుగ రోజు ఇంటికి తీసుకొస్తే.. చాలా మంచిదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి మొక్క:

తులసి మొక్కను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందువుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కను కూడా లక్ష్మీ దేవి రూపంగా భావించి పూజలు చేస్తూంటారు. దీపావళి పండుగ రోజున తులసి మొక్కను ఇంటికి తీసుకు రావడం వల్ల లక్ష్మీ దేవి ఆశీర్వాదం కలుగుతుంది. దీపావళి రోజున తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

బటర్ ఫ్లై పీ ప్లాంట్:

సీతా కోక చిలుక మొక్క లేదా అపరాజిత మొక్క. ప్రస్తుతం ఇవి కూడా అందరి ఇళ్లల్లో కనిపిస్తున్నాయి. అపరాజిత పువ్వులను.. లక్ష్మీ దేవికి ఇష్టమైన పువ్వుగా పరిగణిస్తారు. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఆనందం, విజయానికి మార్గం సుగమం చేస్తాయట. అలాగే ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగు పరుస్తుందట. కాబట్టి దీపావళి రోజు ఈ మొక్కను తీసుకొస్తే మంచిది.

రాత్రి జాస్మిన్ ప్లాంట్:

రాత్రి జాస్మిన్ మొక్క ఆనందానికి మంచిదని అందరూ భావిస్తారు. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ అపరాజిత మొక్కను విష్ణువుగా భావిస్తారు. అలాగే దీన్ని లక్ష్మీ దేవతలకు ఇష్టమైన మొక్కగా భావిస్తారు. ఈ మొక్క పువ్వులను దేవుడికి సమర్పించడం వల్ల ఆశీర్వాదాలు పొందవచ్చు.

ఇలా ఇంటికి ఈ రకమైన మొక్కలు తీసుకు రావడం వల్ల ఇంట్లో శ్రేయస్సు, ఆర్థిక సమస్యలు తొలగి ఆనందంగా ఉండేందుకు సహాయ పడుతుంది.

Follow Us
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ