Dengue Effect on Brain: బ్రెయిన్ పై ఎఫెక్ట్ చూపిస్తున్న డెంగ్యూ.. డేంజర్ అంటోన్న నిపుణులు!
ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని తేల్చారు. అయితే ఇటీవల కాలంలో డెంగ్యూ ఇన్ ఫెక్షన్.. రోగుల బ్రెయిన్ పై కూడా ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. జ్వరం, తొలనొప్పి, ఎర్రటి దద్దర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అయితే కేవలం మెదడుపై మాత్రమే కాకుండా పక్షవాతం లక్షణాలు కూడా..
ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని తేల్చారు. అయితే ఇటీవల కాలంలో డెంగ్యూ ఇన్ ఫెక్షన్.. రోగుల బ్రెయిన్ పై కూడా ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. జ్వరం, తొలనొప్పి, ఎర్రటి దద్దర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అయితే కేవలం మెదడుపై మాత్రమే కాకుండా పక్షవాతం లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా శరీరంలోని వివిధ భాగాలను దెబ్బతీసే అనేక రకా డెంగ్యూ జాతులు నిపుణులు చెబుతున్నారు. ఇలా రోగులకు వారి లక్షణాల బట్టి చికిత్స ను అందిస్తున్నారు వైద్యులు.
సాధారణంగా ఇంట్లో ఒకరికి డెంగ్యూ సోకితే.. మరొకరికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సార్లు డెంగ్యూ జ్వరంతో బాధ పడవచ్చు. ఈ డెంగ్యూ అనేది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముందుగా ఈ దోమలను అరికట్టాలి. దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మెదడుపై డెంగ్యూ ఎఫెక్ట్:
సాధారణంగా డెంగ్యూ సోకినప్పుడు తీవ్రంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, నీరసం, ప్లేట్ లేట్స్ కౌంట్ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు డెంగ్యూ.. శరీర భాగాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బ్రెయిన్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. మెదడుపై డెంగ్యూ ప్రభావాన్ని ఎన్సెఫాలిటిస్ అని అంటాడరు. డెంగ్యూ వచ్చిన వ్యక్తి మెదడు ఉబ్బిపోయి.. వాపునకు గురవుతుంది. దీంతో అతను అపస్మాకర స్థితిలోకి వెళ్లే పరిస్థితి నెలకొంటుంది.
అలాగే నాడీ సంబంధిత సమస్యలు ఎక్కువగా డెంగ్యూ వైరస్ DENV-2, DENV-3 కారకాలకు సంబంధించినవి. గతంలో డెంగ్యూ వైరస్ నేరుగా మెదడుపై దాడి చేయదని తేలింది. కానీ ఇప్పుడు డెంగ్యూ వైరస్.. బ్రెయిన్ పై నేరుగా దాడి చేస్తుంది. మొదటి కాని ప్రకారం.. డెంగ్యూలో కాలేయం, మూత్ర పిండాలు సరిగ్గా పని చేయకపోవడం, అలాగే చెదిరిన ఎలక్ట్రోలైట్స్ కారణంగా పేరుకు పోయిన టాక్సిన్ ల ద్వారా ప్రభావితం చేస్తుంది. రెండో దాని ప్రకారం.. వైరస్ మెదడులోకి నేరుగా దాడి చేయడం చేస్తోంది.
HT ప్రకారం డెంగ్యూ ఎన్సెఫలోపతి కేసులు చిన్న పిల్లలు, కౌమార దశలో కూడా పెరుగుతున్నాయి. ఎన్సెఫలోపతి అనేది డెంగ్యూ వైరస్ వల్ల మెదడులో మంట కారణంగా సంభవించే అరుదైన స్థితి. కొన్ని సాధారణ లక్షణాల్లో మగత, నిద్ర పోవడం, మూర్ఛలు కూడా ఉన్నాయి.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.