Health Care: భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగుతున్నారా.. అలా అస్సలు చేయకండి!

తినే సమయంలో మధ్యలో నీళ్లు తాగవచ్చా? లేదా? అనే దానిపై ఇప్పటికే ఎన్నో రకాల అధ్యయనాలు వచ్చాయి. ఎన్నో పరిశోధనలు కూడా చేశారు నిపుణులు. అయితే భోజనం లేదా టిఫిన్ చేసే సమయంలో నీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియ సరిగ్గా పని చేయదు. నీళ్లు తాగితే ఆహారాన్ని నమలడం ఆపేసి.. మింగుతారు. ఇలా చేయడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, కడుపులో ఉబ్బరం, మలబద్ధం, ఊబకాయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహారం మధ్యలో ద్రవ పదార్థాలు తీసుకుంటే..

Health Care: భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగుతున్నారా.. అలా అస్సలు చేయకండి!
Drinking Water
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 08, 2023 | 8:40 PM

తినే సమయంలో మధ్యలో నీళ్లు తాగవచ్చా? లేదా? అనే దానిపై ఇప్పటికే ఎన్నో రకాల అధ్యయనాలు వచ్చాయి. ఎన్నో పరిశోధనలు కూడా చేశారు నిపుణులు. అయితే భోజనం లేదా టిఫిన్ చేసే సమయంలో నీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియ సరిగ్గా పని చేయదు. నీళ్లు తాగితే ఆహారాన్ని నమలడం ఆపేసి.. మింగుతారు. ఇలా చేయడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, కడుపులో ఉబ్బరం, మలబద్ధం, ఊబకాయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహారం మధ్యలో ద్రవ పదార్థాలు తీసుకుంటే.. నేరుగా ప్రేగుల్లోకి వెళ్లి.. జీర్ణ ఎంజైమ్ లను తొలగిస్తుంది. దీని వల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజన సమయంలో నీరు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు పెరుగుతారు:

టిఫిన్ లేదా భోజనం చేసే సమయంలో ద్రవ పదార్థాలు తాగడం వల్ల బరువు పెరగడంతో పాటు ఇన్సులిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీంతో ఆహారం విచ్ఛిన్నమై కొవ్వుగా మారుతుంది. దీంతో ఊబకాయానికి దారి తీస్తుంది. షుగర్ కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

గ్యాస్ సమస్యలు వస్తాయి:

తినే సమయంలో ద్రవ పదార్థాలు తాగడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి, ఎసిడిటీ, కడుపులో నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. భోజనం చేసేటప్పుడు నీరు తాగితే కొంత గాలి కూడా లోపలికి వెళ్తుంది. దీంతో ఆహారం సరిగ్గా తీసుకోలేము. అంతే కాకుండా గుండెలో మంట వస్తుంది.

లాలాజలం తగ్గిపోతుంది:

జీర్ణ క్రియలో లాలాజలం ముఖ్యమైన భాగం. లాలాజలం వలనే మనం తిన్న ఆహారం బాగా అరుగుతుంది. అలా కాకుండా మీరు భోజనం చేసే సమయంలో నీరు తాగడం వల్ల లాలాజలంపై ప్రభావం పడుతుంది. దీంతో లాలాజలం ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు.

పోషకాలు సరిగ్గా అందవు:

భోజనం చేసే సమయంలో నీరు త్రాగడం వల్ల ఆహారం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. దీని వల్ల ఆహారం కొవ్వుగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నీరు ప్రేగుల్లోకి వెళ్లిపోయిన జీర్ణం చేసే ఎంజైమ్ లను తొలగిస్తుంది. నీటితో కలిసి ఆహారం జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో ఆహారం కడుపులో ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది. దీని వల్ల గ్యాస్ సమస్యలు, ఊబ కాయం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగ్గా అందవు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్