Anti-Aging Fruits: వృద్ధాప్యంలో కూడా యంగ్ గా ఉండాలంటే.. ఈ పండ్లు తినండి!

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చర్మంపై గీతలు, ముడతలు అనేవి కామన్ గా వస్తూంటాయి. కొంత మందికి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే.. వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. మరి కొంత మంది వృద్ధాప్యంలో ఉన్నా కూడా యంగ్ గా ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నా కూడా యంగ్ లుక్ తో మెరిసి పోవాలి అనుకుంటారు కొందరు. అయితే ఏజింగ్ ప్రాసెస్ ను ఆలస్యం చేయవచ్చని చర్మ నిపుణులు అంటున్నారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల వృద్ధాప్యంలో కూడా మంచి లుక్ తో..

Anti-Aging Fruits: వృద్ధాప్యంలో కూడా యంగ్ గా ఉండాలంటే.. ఈ పండ్లు తినండి!
Skin
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 08, 2023 | 8:40 PM

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చర్మంపై గీతలు, ముడతలు అనేవి కామన్ గా వస్తూంటాయి. కొంత మందికి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే.. వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. మరి కొంత మంది వృద్ధాప్యంలో ఉన్నా కూడా యంగ్ గా ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నా కూడా యంగ్ లుక్ తో మెరిసి పోవాలి అనుకుంటారు కొందరు. అయితే ఏజింగ్ ప్రాసెస్ ను ఆలస్యం చేయవచ్చని చర్మ నిపుణులు అంటున్నారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల వృద్ధాప్యంలో కూడా మంచి లుక్ తో ఆకట్టుకోవచ్చు. మంచి ఆహారం తీసుకుంటే శరీరం లోపల, బయట కూడా గుడ్ లుక్ తో ఉండొచ్చు. అందుకే మీ డైట్ లో ఇప్పటి నుంచి మంచి పోషకాలు ఉండేలా చూసుకోండి. కొన్ని రకాల పండ్లు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల వయస్సును దాచేయవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ పండ్లు స్కిన్ ని బ్రైట్ గా, హెల్దీగా ఉండేలా చూడటంలో హెల్ప్ చేస్తాయి. మరి ఆ పండ్లు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్ ఇప్పుడు మార్కెట్ల లో విరివిగా లభిస్తున్నాయి. వీటిల్లో పోషకాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినడం వల్ల కేవలం చర్మం సమస్యలే కాకుండా.. ఆరోగ్య పరంగా కూడా హెల్దీగా ఉండొచ్చు. బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్ అనేవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలను కాపాడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది. అలాగే బ్లూ బెర్రీస్ లో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

ఇవి కూడా చదవండి

అవకాడో:

అవకాడో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగ పడుతుంది. వీటిల్లో మోనోశాచురేటెడ్, విటమిన్లు ఇ, బిలు మెండుగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి చర్మ కణాలను రక్షించడానికి యూజ్ అవుతాయి. అవకాడోను మీ డైట్ లో చేర్చుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.

దానిమ్మ:

దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం బ్రైట్ గా, హైడ్రేట్ గా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చర్మం మాత్రమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. దానిమ్మలో క్యాల్షియం, పొటాషియం, విటమిన్లు ఏ, బి, సి, కే, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే చర్మం యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. చర్మ ఆకృతిని కూడా మెరుగు పరుస్తాయి.

బొప్పాయి:

బొప్పాయి కూడా ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయిలో ఉండే పోషకాలు.. హానికరమైన సూర్య కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. వీటిల్లో ఏ, సి, ఈ ఉంటాయి. ఇవి చర్మా కణాలను రిపేర్ చేసి, మృత కణాలను తొలగిస్తాయి. అలాగే చర్మాన్ని, కాంతి వంతంగా, మృదువుగా చేస్తాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.