- Telugu News Photo Gallery Dhanteras 2023: If you buy these on the day of Dhana Thrayodashi, you will get wealth in the house
Spirituality Tips: ధన త్రయోదశి రోజు వీటిని కొంటే.. ఇంట్లో సిరి సంపదలు వెల్లి విరుస్తాయి!
హిందువుల ముఖ్యమైన పండుగల్లో ధన త్రయోదశి కూడా ఒకటి. ఈ పండుగను కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పండుగ నవంబర్ 10వ తేదీన వచ్చింది. ఈ పండుగ తర్వాతే దీపావళి పండుగ కూడా వస్తోంది. ధన త్రయోదశి రోజు పూజలు చేసినా, ఇంట్లోకి కొన్ని రకాల వస్తువులు కొన్నా.. శ్రేయస్సు, అదృష్టాన్ని తెస్తుందని విశ్విసిస్తూంటారు. అందుకే ధన త్రయోదశి రోజు ఇంట్లోకి అవసరం అయ్యే కొన్ని రకాల వస్తువులను కొంటూంటారు. అలాగే పలు కంపెనీలు..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 08, 2023 | 8:37 PM

దీపావళి.. సత్యయుగంలో ఆశ్వయుజ మాసంలోని అమావాస్యనాడు సముద్ర మథనం నుండి లక్ష్మీదేవి తొలిసారిగా ఉద్భవించింది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మి దేవి వివాహం జరిగినట్లు పురాణ కథనం. అప్పటి నుంచి దీపావళి సంబరాలు మొదలయ్యాయి. తరువాత త్రేతాయుగంలో ఈ రోజున, రాముడు వనవాసం నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ రోజు మహాలక్ష్మిని పూజిస్తారు. ఈ సంవత్సరం దీపావళి పండుగను 12 నవంబర్ 2023 న జరుపుకోనున్నారు.

అందుకే ధన త్రయోదశి రోజు ఇంట్లోకి అవసరం అయ్యే కొన్ని రకాల వస్తువులను కొంటూంటారు. అలాగే పలు కంపెనీలు కూడా దీపావళి పండక్కి బోనస్ లు కూడా ప్రకటిస్తుంది. మరి ధన త్రయోదశి రోజు ఎలాంటి వస్తువులు కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం - వెండి వస్తువులు: ధన త్రయోదశి రోజు బంగారం లేదా వెండి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ కొంటే అదృష్టం లభిస్తుందని నమ్ముతూంటారు. ఎందుకంటే ధన త్రయోదశి రోజు ఏం కొంటే అవి ఇంట్లో స్థిరంగా ఉంటాయని విశ్వసిస్తూంటారు.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు - వంటగది పాత్రలు: ఇల్లును ఎంత నీటిగా అందంగా ఉంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని, ధన త్రయోదశి రోజు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వంటగది పాత్రలు కూడా కొంటున్నారు. కొత్త వస్తువులతో ఇంటిని అలంకరిస్తున్నారు. పలు కంపెనీలు కూడా మంచి మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

దీపాలు: దీపావళి అంటేనే దీపాల పండుగ. దీపావళి పండుగకు ఎంతో చక్కగా దీపాలను అలంకరిస్తే.. ఆ ఇంటికి ఉండే లుక్కే మారి పోతుంది. దీపావళి రోజున ఇంటిని రంగు రంగుల దీపాలతో అలంకరిస్తే.. లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని అందరూ విశ్వసిస్తూంటారు. అంతే కాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది.





























