Fashion Tips: దీపావళి రోజు ఈ దుస్తులు ధరిస్తే మెరిసిపోతారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే!

దీపావళి పండుగ వచ్చేస్తుంది. ఈ పండు అంటే చిన్న పిల్లలకు బాగా ఇష్టం. ఎందుకంటే బోలెడన్ని టపాకాయలు కాల్చవచ్చు. అందుకే ఈ పండుగ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. ఈ ఆనందంలో పిల్లలు ఉంటే.. ఇంట్లోని గృహుణిలు మాత్రం ఇంటిని దీపాలతో అలంకరించే పనిలో పడిపోతారు. ఇక పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బయిలు ఎంత అందంగా రెడీ అవ్వాలా.. అని ఆలోచిస్తూంటారు. అయితే దీపావళి రోజు.. ఇంటి నిండా దీపాలు ఉంటాయి. అలాగే బాణా సంచా కూడా కాలుస్తారు కాబట్టి.. వీటిని దృష్టిలో పెట్టుకుని దుస్తులు ధరించాలి. ఫ్యాషన్ గా ఉండాలి..

Fashion Tips: దీపావళి రోజు ఈ దుస్తులు ధరిస్తే మెరిసిపోతారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే!
Diwali
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 06, 2023 | 9:45 PM

దీపావళి పండుగ వచ్చేస్తుంది. ఈ పండు అంటే చిన్న పిల్లలకు బాగా ఇష్టం. ఎందుకంటే బోలెడన్ని టపాకాయలు కాల్చవచ్చు. అందుకే ఈ పండుగ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. ఈ ఆనందంలో పిల్లలు ఉంటే.. ఇంట్లోని గృహుణిలు మాత్రం ఇంటిని దీపాలతో అలంకరించే పనిలో పడిపోతారు. ఇక పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బయిలు ఎంత అందంగా రెడీ అవ్వాలా.. అని ఆలోచిస్తూంటారు. అయితే దీపావళి రోజు.. ఇంటి నిండా దీపాలు ఉంటాయి. అలాగే బాణా సంచా కూడా కాలుస్తారు కాబట్టి.. వీటిని దృష్టిలో పెట్టుకుని దుస్తులు ధరించాలి. ఫ్యాషన్ గా ఉండాలి.. సౌకర్యవంతంగా ఉండాలి అంటే ఎలాంటి బట్టలు ధరించాలో ఇప్పుడు చూద్దాం.

సౌకర్యంగా ఉండే వాటిని ఎంచుకోండి:

దీపావళి రోజు ఇళ్లంతా సందడిగా ఉంటుంది. ఇంటిలో ఎటు చూసినా దీపాలు ఉంటాయి. అలాగే బాణా సంచా కూడా కాలుస్తారు. ఈ సమయంలో పరిగెడుతూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకూ సౌకర్యంగా ఉండే వాటిని ఎంచుకుంటే బెటర్.

ఇవి కూడా చదవండి

అగ్ని ప్రమాదాన్ని తగ్గించే దుస్తులు ఎంచుకోవాలి:

సాధారణంగా వీలైనంత వరకూ బాణా సంచా కాల్చేటప్పుడు పాత బట్టలు వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే బాణా సంచా కాల్చేటప్పుడు, ఇంట్లో దీపాలకు ఎక్కడైనా మచ్చలు, మరకలు పడవచ్చు. అలాగే పొడవాటి చున్నీలు, పొడవుగా శారీ పల్లు పెట్టుకోక పోవడమే మంచిది.

అందంగా మెరిసిపోవాలంటే ఇవి బెస్ట్:

దీపావళి రోజు సౌకర్యవంతంగా అందంగా మెరవాలంటే.. బనారసీ శిల్క్, చందేరీ, ఆర్గాన్జా వంటి క్లాత్ దుస్తులు ఎంచుకుంటే ఇవి మెరుస్తూ ఉంటాయి. మీ ముఖంలో కూడా కళ వస్తుంది. అలాగే మిక్స్ అండ్ మ్యాచింగ్ గురించి అస్సలు భయ పడవద్దు. దీపావళి రోజు డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయవచ్చు. ఒక వేళ మీరు కాటన్ లేదా ఖాదీ దుస్తులు ఎంచుకుంటే మాత్రం వాటికి మరింత లుక్ వచ్చేలా మంచి బ్రైట్ కలర్ ఆభరణాలను వేసుకుంటే మంచి లుక్ మీ సొంతం అవుతంది.

మేకప్ ఇలా వేసుకోండి:

దీపావళి రోజు మీరు మెరిసిపోవాలంటే.. మెరిసే కంపాక్ట్ పౌడర్ ఎంచుకోండి. అలాగే షైనీ ఐ షాడో, బ్రైట్ కలర్ లిప్ స్టిక్స్ వల్ల మీరు మరింత అందంగా కనిపిస్తారు.

మాస్క్ లను ధరించండి:

సాధారణంగా దీపావళి రోజు కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే క్రాకర్స్ ఎక్కువగా కాలుస్తారు కాబట్టి.. గాలి కాలుష్యం అవుతుంది. ఆ పొగను మనం అస్సలు పీల్చకూడదు. కాబట్టి చిన్న పిల్లలైనా, పెద్దవారైనా మాస్క్ లను ధరించడం ఉత్తమం.