Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips For Sleep: రాత్రి పడుకునే ముందు వీటిని తీసుకుంటే.. చంటి పిల్లల్లా హాయిగా పడుకుంటారు!

నిద్ర అనేది ఆరోగ్యానికి అత్యంత కీలకమైన వాటిల్లో ఒకటి. సరైన విధంగా నిద్ర లేకపోతే.. అనేక రకాల సమస్యల్ని మనం ఎదుర్కొంటాం. అంతే కాకుండా ఏ విషయంపైన కూడా సరైన విధంగా ధ్యాస పెట్టలేం. ఆకలి, జీర్ణాశయం, గుండె ఆరోగ్యం అన్నింటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పెద్దలకు ఏడు నుంచి ఎనిమిది గంటల చాలా ముఖ్యం. అయితే ఇప్పుడున్న జీవన శైలి కారణంగా చాలా మంది సరైన సమయానికి నిద్ర పోవడం లేదు. ఫోన్లు, టీవీలు చూస్తూ అర్థ రాత్రుల వరకూ కాల క్షేపం..

Tips For Sleep: రాత్రి పడుకునే ముందు వీటిని తీసుకుంటే.. చంటి పిల్లల్లా హాయిగా పడుకుంటారు!
Sleeping On Stomach
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 08, 2023 | 8:39 PM

నిద్ర అనేది ఆరోగ్యానికి అత్యంత కీలకమైన వాటిల్లో ఒకటి. సరైన విధంగా నిద్ర లేకపోతే.. అనేక రకాల సమస్యల్ని మనం ఎదుర్కొంటాం. అంతే కాకుండా ఏ విషయంపైన కూడా సరైన విధంగా ధ్యాస పెట్టలేం. ఆకలి, జీర్ణాశయం, గుండె ఆరోగ్యం అన్నింటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పెద్దలకు ఏడు నుంచి ఎనిమిది గంటల చాలా ముఖ్యం. అయితే ఇప్పుడున్న జీవన శైలి కారణంగా చాలా మంది సరైన సమయానికి నిద్ర పోవడం లేదు. ఫోన్లు, టీవీలు చూస్తూ అర్థ రాత్రుల వరకూ కాల క్షేపం చేస్తున్నారు. ఉదయం హడావిడిగా పరుగులు పెడుతున్నారు. అయితే నిద్ర పోయే ముందు వీటిని తినడం వల్ల చంటి పిల్లల్లా నిద్ర పోతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడి కాయ గింజలు:

గుమ్మడి కాయ గింజలు అనేవి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తినడం వల్ల.. ప్రశాంతంగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే మెగ్నీషియం కంటెంట్ కండరాల సడలింపుగా పని చేస్తుంది. ఇది మెలటోనిన్ ద్రవాన్ని పెంచుతుంది. మెలటోనిన్ అనేది నిద్ర హార్మోన్. సాధారణంగా చీకటి ప్రదేశంలో ఉన్నప్పుడు శరీరం మెలటోనిన్ సహజంగా విడుదల చేస్తుంది.

ఇవి కూడా చదవండి

గుమ్మడి కాయ గింజల్లో కాదు.. వీటిల్లో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది:

మెగ్నీషియం అనేది కేవలం గుమ్మడి కాయ గింజల్లో మాత్రమే కాదు.. ఇతర ఆహార పదార్థాల్లో కూడా లభ్యమవుతుంది. అవేంటంటే.. నువ్వులు, బాదం, పొద్దు తిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు. నిద్ర నాణ్యతను మెరుగు పరచడానికి సూచించిన పోషక పదార్థాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను సడలించడంతో పాటు నిద్ర నాణ్యతను మెరుగు పరిచే విధంగా శరీరంలో రసాయనిక చర్యలను చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ట్రిప్టోఫాన్ ఉన్న పదార్థాలు తిన్నా హాయినా నిద్ర పడుతుంది:

అంతే కాకుండా గుమ్మడి కాయ గింజల్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది మానసిక స్థితిని పెంచుతుంది. అలాగే నిద్ర నాణ్యతను పెంచుతుంది. శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ లను ఎక్కువగా విడుదల చేయడం వల్ల ఇది దీర్ఘకాలికంగా నిద్ర లేమి సమస్యకి చికిత్స చేయడంలో హెల్ప్ చేస్తుంది. నిద్ర పోయే ముందు ఒక గ్రాము లేదా అంతకంటే ఎక్కువగా ట్రిఫ్టోఫాన్ తీసుకుంటే.. నిద్ర అనేది హాయిగా పడుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఈ ట్రిఫ్టోఫాన్ అనేది ఇతర ఆహార పదార్థాల్లో కూడా లభ్యమవుతుంది. రాత్రి పడుకునే ముందు ఇవి తిన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కోడి గుడ్లు, వాల్ నట్స్, మిల్క్, సాల్మన్, పైనాపిల్, టర్కీ లాంటి ఆహార పదార్థాలు తీసుకున్నా రాత్రి చక్కగా నిద్ర పడుతుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.