Kidneys Health: ఇక పై నో టెన్షన్.. ఈ టిప్స్ తో మీ కిడ్నీలను ఈజీగా క్లీన్ అయిపోతాయి!
మన శరీరంలో కిడ్నీలు కూడా ఒక భాగమే. మనం తినే ఆహారాలను మూత్ర పిండాలే ఫిల్టర్ చేసి.. వ్యర్థాలను బయటకి పంపిస్తాయి. రక్తాన్ని కూడా శుభ్ర పరుస్తాయి. అయితే కిడ్నీల ఆరోగ్యం కూడా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి. కిడ్నీలు హెల్దీగా ఉంటేనే మనం జీవ క్రియ అనేది సాఫీగా జరుగుతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ ఎఫెక్ట్ మొత్తం శరీరంపై పడుతుంది. కాబట్టి మూత్ర పిండాలు..
మన శరీరంలో కిడ్నీలు కూడా ఒక భాగమే. మనం తినే ఆహారాలను మూత్ర పిండాలే ఫిల్టర్ చేసి.. వ్యర్థాలను బయటకి పంపిస్తాయి. రక్తాన్ని కూడా శుభ్ర పరుస్తాయి. అయితే కిడ్నీల ఆరోగ్యం కూడా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి. కిడ్నీలు హెల్దీగా ఉంటేనే మనం జీవ క్రియ అనేది సాఫీగా జరుగుతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ ఎఫెక్ట్ మొత్తం శరీరంపై పడుతుంది. కాబట్టి మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు చాలా అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మ – నారింజ పండ్లు:
నిమ్మ జాతికి చెందిన పండ్లను తినడం శరీరంలో తేమగా ఉంటుంది. అదే విధంగా మూత్ర పిండాల్లోని వ్యర్థాలను బయటకు పంపేందుకు ఇది హెల్ప్ చేస్తుంది. ఈ పండ్లలో అధిక స్థాయిలో సిట్రేట్ ఉంటుంది. ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పకుండా చూస్తాయి. అలాగే మూత్రంలో తక్కువ ఆమ్లాన్ని అడ్డకుంటాయి.
దోసకాయ:
చాలా మందికి నచ్చని కూరగాయాల్లో దోస కాయ కూడా ఒకటి. దీన్ని చూస్తేనే ఆమడ దూరం పోతారు. పచ్చడి చేస్తే ఏదో ఒక ముద్ద నోట్లోకి వెళ్తుంది కానీ.. దోస కాయతో కూర చేస్తే మాత్రం ఇక అంతే. ఆ రోజు ఇంట్లో యుద్ధాలే. కానీ మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడడంలో దోస కాయ బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఎక్కువగా నీరు శాతం ఉంటుంది కాబట్టి.. మూత్ర పిండాల్లో నీరు ఏర్పడకుండా చూస్తుంది. దోసకాయ తినడం వల్ల కిడ్నీల పని తీరు మెరుగు పడుతుంది. అలాగే శరీరానికి కూడా చలువ చేస్తుంది.
క్రాన్ బెర్రీస్:
ప్రస్తుతం ఇవి కూడా మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. తరచూ ఈ పండ్లను తినడం వల్ల మూత్ర పిండాల్లో ఇన్ ఫెక్షన్ రాకుండా ఉంటుంది. వీటిని తిన్నా, జ్యూస్ రూపంలో తాగినా మంచిదే. దీని వల్ల శరీరంలో హైడ్రేట్ గా ఉంటుంది. కిడ్నీల్లో, శరీరంలో వ్యర్థాలు బయటకు పోతాయి.
నీరు:
నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదని వైద్యులు చెబుతూనే ఉంటారు. నీటి వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి మరి. ముఖ్యంగా మూత్ర పిండాలను శుభ్ర పరచడంలో నీరు మంచి పాత్ర పోషిస్తుంది. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలను శుభ్ర పరిచి, డిటాక్సిఫికేషన్ చేస్తుంది. అలాగే మూత్ర పిండాల్లో వ్యర్థాలు ఏమైనా ఉంటే బయటకు వెళ్తాయి. శరీరాన్ని కూడా హైడ్రేట్ గా ఉంచుతుంది.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.