Changes before death: మరణానికి ముందు మనిషి శరీరంలో జరిగే మార్పులు ఇవే!

అసలు మరణం ఎలా ఉంటుంది? ఎవరికీ తెలీదు. దాన్ని అనుభం కూడా చేయలేరు. అది చనిపోయిన వారికే తెలుస్తుంది. కానీ వారు చెప్పలేరు. అలాగే కొంత మంది చనిపోయిన వ్యక్తులు కనిపిస్తున్నారని, మాట్లాడతారని చెబుతూంటారు. కానీ అవన్నీ భ్రమలని కొట్టి పడేస్తారు వైద్య నిపుణులు. ఈ విషయం పక్కకు పెడితే.. చనిపోయే ముందు మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయట. అయితే ఇటీవల చనిపోయే స్థితిలో ఉన్నవారిపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కొన్ని..

Changes before death: మరణానికి ముందు మనిషి శరీరంలో జరిగే మార్పులు ఇవే!
Death
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 07, 2023 | 8:45 PM

అసలు మరణం ఎలా ఉంటుంది? ఎవరికీ తెలీదు. దాన్ని అనుభం కూడా చేయలేరు. అది చనిపోయిన వారికే తెలుస్తుంది. కానీ వారు చెప్పలేరు. అలాగే కొంత మంది చనిపోయిన వ్యక్తులు కనిపిస్తున్నారని, మాట్లాడతారని చెబుతూంటారు. కానీ అవన్నీ భ్రమలని కొట్టి పడేస్తారు వైద్య నిపుణులు. ఈ విషయం పక్కకు పెడితే.. చనిపోయే ముందు మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయట. అయితే ఇటీవల చనిపోయే స్థితిలో ఉన్నవారిపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకలి ఉండక పోవడం:

ఒక వ్యక్తి ఒక నెల రోజుల నుంచి సరైన ఆహారం తీసుకోకుండా ఉంటే మాత్రం.. అతను మరణానికి దగ్గరిగా ఉన్నారని సంకేతం కావచ్చు. మరణం సమీపిస్తున్న కొద్దీ వారికి ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. క్రమంగా కొన్ని రోజులకు తినడం, మంచి నీరు తాగడం కూడా మానేస్తారు.

ఇవి కూడా చదవండి

అతిగా నిద్ర పోవడం:

మరణానికి సంభవించే కొన్ని రోజులకు ముందు ఆ వ్యక్తి ఎక్కువగా నిద్ర పోవచ్చు. ఎందుకంటే వారు సరిగా ఏమీ తినరు. అలాగే జీవ క్రి కూడా బలహీన పడి పోతుంది. దీంతో నిద్ర ఎక్కువగా పడుతుంది. ఈ సమయంలో వారికి బాగా ఇష్టమైన వ్యక్తుల్ని చూడాలనుకుంటారు.

ఎక్కువగా మాట్లాడక పోవడం:

మరణిస్తున్న వ్యక్తిలో రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఎనర్జీ లెవల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువ మందిలో కూర్చోవడానికి కూడా ఇష్ట పడరు. ఒంటరిగా ఫీల్ అవుతూ.. ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడతారు.

కండరాల బలహీనత:

మరణానికి సమీపిస్తున్న వ్యక్తులు సరిగా ఆహారం తీసుకోరు. దీంతో ఇమ్యూనిటీ తగ్గిపోయి శరీరం బలహీనతకు గురవుతుంది. ముఖ్యంగా కండరాలు అనేవి బలహీనంగా మారిపోతాయి. వారు నిల్చోవడానికి, కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న చిన్న అవసరాలకు కూడా మనిషి అవసరం అవుతారు.

బ్లడ్ ప్రెజర్ డ్రాప్స్:

ఒక వ్యక్తి మరణానికి సమీపిస్తున్నప్పుడు చాలా సంకేతాలు కనిపిస్తాయి. వాటిల్లో శ్వాస ఆడకపోవడం, ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, పల్స్ పడిపోవడం, గుండె రేటు సక్రమంగా పని చేయకపోవడం, శరీర రంగు మారిపోతుంది, మూత్రం రంగు కూడా మారుతుంది. మూత్ర పిండాలు కూడా వైఫల్యం చెందుతాయి. ఇలా అనేక రకాల మార్పులు అనేవి ఎదురవుతూ ఉంటాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.