Chronic Fatigue Syndrome: అలసట, నీరసం తగ్గడం లేదా.. ఆ సమస్య అయి ఉండొచ్చు జాగ్రత్త!
సాధారణంగా ఎవరికైనా ఒక్కో సందర్భంగా అలసట, నీరసానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లోని గృహిణులు పని భారం, పిల్లలతో, నిద్ర లేమి కారణంగా అలసటకు గురవుతారు. ఒక్క కునుకు తీస్తే ఆ అలసట, నీరసం మాయం అవుతాయి. అయితే అలా విశ్రాంతి తీసుకున్నా అలసటగా అనిపిస్తే.. వారు క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ కి గురైనట్టు. ఈ సమస్య ఉన్న వారికి విపరీతమైన నీరసం, అలసట ఉంటాయి. ఈ సమస్య ఆరు నెలల పాటు ఉంటుంది. ఈ సమస్య.. రోగ నిరోధక శక్తి లోపించడం..
సాధారణంగా ఎవరికైనా ఒక్కో సందర్భంగా అలసట, నీరసానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లోని గృహిణులు పని భారం, పిల్లలతో, నిద్ర లేమి కారణంగా అలసటకు గురవుతారు. ఒక్క కునుకు తీస్తే ఆ అలసట, నీరసం మాయం అవుతాయి. అయితే అలా విశ్రాంతి తీసుకున్నా అలసటగా అనిపిస్తే.. వారు క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ కి గురైనట్టు. ఈ సమస్య ఉన్న వారికి విపరీతమైన నీరసం, అలసట ఉంటాయి. ఈ సమస్య ఆరు నెలల పాటు ఉంటుంది. ఈ సమస్య.. రోగ నిరోధక శక్తి లోపించడం, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్, ఒత్తిడి, మానసిక సమస్యలు, ఇన్ ఫెక్షన్లు వంటి కారణాల వల్ల రావచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (CFS)ని నేచురల్ టిప్స్ తో ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
క్రానిక్ ఫేటీగ్ సిండ్రోమ్ లక్షణాలు:
జ్ఞాపక శక్తి లోపించడం, అలసట, నీరసం, ఏకాగ్రత లోపించడం, నిద్ర సరిగ్గా పట్టక పోవడం, కీళ్ల నొప్పులు, తల నొప్పి, గొంతు నొప్పి, శోషరస కణుపులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోండి:
ఈ సమస్య నుంచి బయట పడాలంటే పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. మీ లైఫ్ స్టైల్ ను మార్చుకోండి. బీజీ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోండి. మీరు హెల్దీగా ఉంటేనే.. దీర్ఘకాలింగా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోగలరు. కాబట్టి ఉదయాన్న వ్యాయామాలు లేదా వాకింగ్, యోగా వంటివి అలవరచుకోండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. ప్రశాతంగా నిద్ర పోయేలా చూసుకోండి. అలాగే ఒత్తిడిగా అనిపించే విషయాలను పక్కకు పెట్టండి. ఇలా మార్పులు చేసుకోవడం వల్ల క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ నుంచి బయట పడొచ్చు.
శారీరక శ్రమ తగ్గించు కోవాలి:
శారీరక శ్రమ కారణంగా ఈ లక్షణాలు అనేవి తీవ్రమవుతాయి. కాబట్టి శారీరక శ్రమను తగ్గించుకోండి. అవసరం అయినప్పుడు మీ శరీరానికి రెస్ట్ ఇవ్వండి.
ఒత్తిడిని తగ్గించు కోవాలి:
బ్రెయిన్ పై ఒత్తిడిని తీసుకొచ్చే విషయాలకు వీలైనంత వరకూ దూరంగా ఉండండి. లేదంటే ఈ సమస్య తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు నచ్చిన పనులను చేయడం ప్రారంభించండి. మ్యూజిక్ వినడం, డ్యాన్స్ చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు.
నీళ్లు – ఆహారం:
నీళ్లు ఎక్కువగా తాగితేనే శరీరం హైడ్రేట్ ఉంటుంది. దీంతో డీ హైడ్రేషన్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ఫ్రెష్ కూరగాయలు, పండ్లను మీ డైట్ లో చేర్చుకోండి.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.