Immunity Boosting Soup: సీజనల్ వ్యాధులను దూరం చేసి.. ఎనర్జీ పెంచే హెల్దీ సూప్!

సీజన్లు మారుతున్నాయి.. చలి కాలం వచ్చేసింది. ఇలా వాతావరణ పరిస్థితులు మారేటప్పుడల్లా జలుబు, దగ్గు, జ్వరం అనేవి కామన్ గా వచ్చే అనారోగ్య సమస్యలు. అలాగే ఇంకొందరిలో ఇమ్యూనిటీ లోపించి ఇన్ ఫెక్షన్లు కూడా వస్తాయి. ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాంటే శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండాలి. ముఖ్యంగా చలి కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, పలు రకాల ఇన్ ఫెక్షన్లు..

Immunity Boosting Soup: సీజనల్ వ్యాధులను దూరం చేసి.. ఎనర్జీ పెంచే హెల్దీ సూప్!
Soup
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 05, 2023 | 9:58 PM

సీజన్లు మారుతున్నాయి.. చలి కాలం వచ్చేసింది. ఇలా వాతావరణ పరిస్థితులు మారేటప్పుడల్లా జలుబు, దగ్గు, జ్వరం అనేవి కామన్ గా వచ్చే అనారోగ్య సమస్యలు. అలాగే ఇంకొందరిలో ఇమ్యూనిటీ లోపించి ఇన్ ఫెక్షన్లు కూడా వస్తాయి. ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాంటే శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండాలి. ముఖ్యంగా చలి కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, పలు రకాల ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటివి రాకుండా ఉండాలంటే.. సరైన ఆహారం తీసుకోవాలి. ఈ సూప్ ని సీజన్లు మారే సమయంలో తాగడం వల్ల.. శరీరానికి మంచి బూస్టింగ్ అందుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి ఈ బీట్ రూట్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్ రూట్ సూప్ కి కావాల్సిన పదార్థాలు:

బీట్ రూట్స్, క్యారెట్, ఉల్లి పాయ, టమాటాలు, జీల కర్ర, గరం మసాలా, ఉప్పు, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్స్, నూనె.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి పాయలు, టమాటాలు, క్యారెట్, బీట్ రూట్స్, జీల కర్ర, ఒక కప్పు నీళ్లు వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించు కోవాలి. కుక్కర్ లో ప్రెజర్ పోయి.. చల్లారేంత వరకూ పక్కకు పెట్టుకోవాలి. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి.. ఉడికిన కూరగాయలను బ్లెండర్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి పాన్ తీసుకోండి. ఇందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పాన్ లో వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించు కోవాలి.

అవసరం అయితే కొద్దిగా నీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. సూప్ లా దగ్గరకి చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బీట్ రూట్ సూప్ రెడీ. ఈ సూప్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి.. అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. డయాబెటీస్ ఉన్న వారు కూడా ఈ సూప్ ని తాగవచ్చు.

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే