- Telugu News Photo Gallery Beauty Tips: Follow these Easy Home Remedies to Remove Moles From Your Face
Moles on Face: ముఖంపై పుట్టుమచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా సులువుగా వదిలించుకోండి..
కొందరికి ముఖంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. ఇవి చూడ్డానికి అసహ్యంగా ఉండటంతో నలుగురిలో కలవలేక ఇబ్బంది పడిపోతుటారు. అయితే కొందరికి ఇవి బ్యూటీ స్పాట్‌గా ఉంటాయి. మరికొందరికేమో ఈ పుట్టుమచ్చలు ముఖం అంతా వికారంగా కనిపిస్తుంటాయి. పుట్టుమచ్చలను వదిలించుకోవాలనుకునే వారు ఈ కింది చిట్కాలను ఫాలో అయితే చిటికెలో మాయం చేసేయొచ్చు. ఎలాగంటే..
Updated on: Nov 06, 2023 | 8:53 PM

కొందరికి ముఖంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. ఇవి చూడ్డానికి అసహ్యంగా ఉండటంతో నలుగురిలో కలవలేక ఇబ్బంది పడిపోతుటారు. అయితే కొందరికి ఇవి బ్యూటీ స్పాట్‌గా ఉంటాయి. మరికొందరికేమో ఈ పుట్టుమచ్చలు ముఖం అంతా వికారంగా కనిపిస్తుంటాయి. పుట్టుమచ్చలను వదిలించుకోవాలనుకునే వారు ఈ కింది చిట్కాలను ఫాలో అయితే చిటికెలో మాయం చేసేయొచ్చు. ఎలాగంటే..

వెల్లుల్లిని ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై పుట్టుమచ్చలను వదిలించుకోవచ్చు. వెల్లుల్లిని ముఖానికి రాసుకుంటే పుట్టుమచ్చ రంగు పలచబారుతుంది. లేదా పూర్తిగా తొలగిపోతుంది కూడా. వెల్లుల్లిని రోజూ అప్లై చేయకుండా కొన్ని రోజులు వ్యవధి ఇస్తూ అప్లై చేస్తే ఫలితం ఉంటుంది.

బంగాళాదుంప రసం ముఖ సౌందర్యానికి చాలా మంచిది. బంగాళదుంప రసాన్ని అప్లై చేయడం వల్ల మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముట్టుమచ్చలపై బంగాళదుంప రసాన్ని పూయడం ద్వారా తేలికగా తొలగించుకోవచ్చు.

తేనె - నిమ్మరసం ఈ రెండింటిలో చర్మానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి. నిమ్మకాయ రసాన్ని తేనెతో కలిపి పుట్టుమచ్చలపై రాస్తే పుట్టుమచ్చలు మాయమవుతాయి. మీరు ఈ చిట్కాను రోజుకు ఎన్ని సార్లు అయినా ట్రై చేయవచ్చు.

అయోడిన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖం మీద పుట్టుమచ్చలను వదిలించుకోవాలనుకునే వారు అయోడిన్ ఉపయోగించవచ్చు. అయోడిన్‌ను మితంగా ఉపయోగించడం వల్ల పుట్టుమచ్చలు మాయమవుతాయి. అయితే అయోడిన్ ఇతర చర్మ సమస్యలకు కూడాకారణమవుతుంది.