- Telugu News Photo Gallery Interesting Facts: Find out whether the cooking oil you are using is good or not, check here is details
Interesting Facts: మీరు వాడుతున్న వంట నూనె మంచిదో.. కాదో.. ఇలా తెలుసుకోండి!
మనం చేసే వంటల్లో ముఖ్యమైనది నూనె. ఆయిల్ లేనిదే ఏ వంటా పూర్తి కాదు. దీంతోనే కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ లో ఎన్నో రకాలు ఉంటాయి. ఎవరికి నచ్చిన బ్రాండ్ వారు వాడుతూ ఉంటారు. అయితే సాధారణంగా కూరగాయలు, పప్పులు, పండ్లు లాంటి వాటిల్లో ఏవి మంచివో తెలుసుకోవడం సులభమే కానీ వంట నూనె మంచిదో కాదో తెలుసు కోవాలంటే మాత్రం చాలా కష్టం. అందుకే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అంథారిటీ ఆఫ్ ఇండియా..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 11, 2023 | 8:41 PM

మనం చేసే వంటల్లో ముఖ్యమైనది నూనె. ఆయిల్ లేనిదే ఏ వంటా పూర్తి కాదు. దీంతోనే కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ లో ఎన్నో రకాలు ఉంటాయి. ఎవరికి నచ్చిన బ్రాండ్ వారు వాడుతూ ఉంటారు. అయితే సాధారణంగా కూరగాయలు, పప్పులు, పండ్లు లాంటి వాటిల్లో ఏవి మంచివో తెలుసుకోవడం సులభమే కానీ వంట నూనె మంచిదో కాదో తెలుసు కోవాలంటే మాత్రం చాలా కష్టం.

అందుకే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అంథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ కల్తీ ఆహార పదార్థాలను ఎలా కనిపెట్టాలో వెల్లడించింది. ఈ టిప్స్ తో మనం ఇంట్లోనే కల్తీ నూనెను కనుక్కోవచ్చు. మరి మీరు వాడే వంట నూనె మంచిదో కాదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి.

ఒక మిల్లీ లీటర్ వంట నూనెను తీసుకుని.. ఒక టెస్ట్ ట్యూబ్ లో వేసుకోవాలి. ఇందులో నాలుగు మిల్లీ లీటర్ల డిస్టిల్డ్ వాటర్ ను కలపాలి. దీన్ని బాగా షేక్ చేయండి. ఇలా షేక్ చేసిన మిశ్రమాన్ని సగం వేరే ట్యూబ్ లో వేసుకోవాలి. ఆ ట్యూబ్ లో కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను కలపండి. =

ఆ తర్వాత కాసేపు ట్యూబ్ ను అలా వదిలేయండి. ఒక అరగంట తర్వాత ట్యూబ్ లోని పై పొర పసుపు రంగులా ఏర్పడితే అది కల్తీదని అర్థం చేసుకోవాలి. పైన ఎలాంటి పసుపు రంగు పొర ఏర్పడకుండా ఉంటే ఆ నూనె మంచిదని అర్థం చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే సులువుగా ఆయిల్ ను టెస్ట్ చేసుకోవచ్చు. దీంతో ఏ ఆయిల్ మంచిదో మీకు తెలిసి పోతుంది.

సాధారణంగా వంట నూనె పసుపు రంగులో ఉండేందుకు అందులో మెటానిల్ అని పిలిచే పసుపు రంగును ఉపయోగిస్తారు. ఇది హెల్త్ కు చాలా ప్రమాదకరం. ఇది బ్రెయిన్ పై తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీని వల్ల మెదడు మెద్దు బారిపోయి.. ఏకాగ్రత అనేది తగ్గిపోతుంది.





























