Pandem Kollu: లక్షల విలువజేసే పందెం కోళ్ల దొంగతనాలు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని పోలీసుల సూచన

ప్రతి యేటా సంక్రాంతి పండుగకు ఏపీలోని గోదావరి జిల్లాలో పెద్ద యెత్తున కోడిపందాలు జరుగుతాయి. పండుగ మూడు రోజుల పాటు పందాల పేరుతో కోట్ల రూపాయల నగదు చేతులు మారుతాయి. అలాంటి పందాల కోసం పోటీ పడే పందెం కోళ్లు సైతం వేల రూపాయలు..కాదు..కాదు లక్షల రూపాయలు కూడా పలుకుతాయి

Pandem Kollu: లక్షల విలువజేసే పందెం కోళ్ల దొంగతనాలు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని పోలీసుల సూచన
Fighting Rooster
Follow us
B Ravi Kumar

| Edited By: Surya Kala

Updated on: Nov 06, 2023 | 8:08 AM

తెలుగు లోగిళ్ళలో అతి పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగ వస్తుందంటే చాలు తెలుగురాష్ట్రాల్లో కోడిపందాలు హడావిడి అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం ఈ పందెం కోళ్లు పెంచుతున్న పెంపకం దారులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారట. దీని వెనుక రీజన్ ఏమిటో తెలుసా..

ప్రతి యేటా సంక్రాంతి పండుగకు ఏపీలోని గోదావరి జిల్లాలో పెద్ద యెత్తున కోడిపందాలు జరుగుతాయి. పండుగ మూడు రోజుల పాటు పందాల పేరుతో కోట్ల రూపాయల నగదు చేతులు మారుతాయి. అలాంటి పందాల కోసం పోటీ పడే పందెం కోళ్లు సైతం వేల రూపాయలు..కాదు..కాదు లక్షల రూపాయలు కూడా పలుకుతాయి. ఒక జాతి పందెంకోడి పెంపకానికి సుమారు 25 వేల వరకు ఖర్చు అవుతుంది. అలా పెంచిన  కోడి పుంజులను వాటి రంగు, పోరాట పటిమ, ఎత్తు చూసి 50 వేల నుంచి 5 లక్షల వరకు వాటిని అమ్ముతారు.

సంక్రాంతి పండుగకు రెండు మూడు నెలల ముందు నుంచే గోదావరిజిల్లాలో రకరకాల పందెం కోళ్లను కొందరు ప్రత్యేకంగా పెంచుతారు. అయితే ఆ కోళ్లను పెంచే పెంపకం దారులకు ఇప్పుడు కంటిమీదకునుకు లేకుండా పోయింది. దానికి కారణం ఇటీవల పందెం కోళ్ల దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయట. ఎంతో కష్టపడి పెంచిన పుంజులను నూజివీడు పరిసర ప్రాంతాల్లో రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లిపోతుండటంతో పెంపకం దారులు ఆందోళన చెందుతున్నారు. నూజివీడు మండలం రావిచర్లకు చెందిన మోత్కుమిల్లి శ్రీనివాసరావు దంపతులను దొంగలు కత్తితో బెదిరించి కోళ్ల ఫాంలో పెంచుతున్న 4 లక్షలు విలువ చేసే పందెం పుంజులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

కోళ్ల పెంపకం దారులు ఫాం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నూజివీడు పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. త్వరలోనే కోళ్ల దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..