Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: ప్రజల ముందుకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. నేటినుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం

Why AP Needs YS Jagan : ఏడాదిన్నరగా అనేక కార్యక్రమాలతో పార్టీ కేడ‌ర్ మొత్తం ప్రజల్లోనే ఉండేలా చూస్తున్న వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. డిసెంబ‌ర్ 19 వర‌కూ నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి మ‌రోసారి సీఎంగా జ‌గ‌నే ఎందుకు ఉండాల‌నే దానిపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్రజలకు అందించిన సేవలు, సంక్షేమం, అభివృద్ధిని చెబుతూ ప్రజల ముందుకు వెళ్తారు.

YS Jagan: ప్రజల ముందుకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. నేటినుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం
AP CM YS Jagan
Follow us
S Haseena

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 09, 2023 | 6:51 AM

Why AP Needs YS Jagan : ఏడాదిన్నరగా అనేక కార్యక్రమాలతో పార్టీ కేడ‌ర్ మొత్తం ప్రజల్లోనే ఉండేలా చూస్తున్న వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. డిసెంబ‌ర్ 19 వర‌కూ నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి మ‌రోసారి సీఎంగా జ‌గ‌నే ఎందుకు ఉండాల‌నే దానిపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్రజలకు అందించిన సేవలు, సంక్షేమం, అభివృద్ధిని చెబుతూ ప్రజల ముందుకు వెళ్తారు. వై ఏపీ నీడ్స్‌ జగన్ లో ప్రధానంగా 4 కార్యక్రమాలుంటాయి. మొదటిది 2వేల మంది జనాభా ఉన్న ప్రధాన కూడళ్లులో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ జెండా ఆవిష్కరణ, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, ప్రభావశీలురైన వారితో చర్చలు జరిపి వారి అభిప్రాయాలు, సూచనల్ని స్వీకరిస్తారు. చంద్రబాబుతో పాటు ఇత‌ర పార్టీ నేత‌లు మరలా మోసపూరిత విధానాలతో ఎలా వస్తున్నారనేది వివరిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ మరుసటి రోజు అదే గ్రామంలో డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ ఉంటుంది. ఈ క్యాంపెయిన్‌లో పార్టీ నాయకులతో పాటు పార్టీ అధ్యక్షులుగా నియమించిన సచివాలయ సారథులు, గృహసారథులు ఉంటారు. పార్టీ మద్దతుదారులూ ఉంటారు.

ప్రభుత్వానికి సంబంధించి వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కూడా ఉంటారు. పార్టీపరంగా పార్టీ నేతలు, ప్రభుత్వపరంగా సచివాలయ సిబ్బంది ఎవరికి వారు ప్రజలతో నేరుగా మాట్లాడుతారు. ఇందులో అక్కడక్కడా ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలు కూడా హాజరవుతూ ఉంటారు. ప్రభుత్వ బుక్‌లెట్‌ను వాలంటీర్లు ప్రజలకు పంపిణీ చేస్తారు. డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీపరంగా గృహసారథులు పార్టీ తరఫున బ్రోచర్లను అందజేస్తారు. చంద్రబాబు గ‌త‌ మ్యానిఫెస్టో హామీల్ని గుర్తుచేస్తూ.. ఆపు బాబు నాటకం.. జగనే మా నమ్మకం పేరిట ప్రజాతీర్పు పుస్తకంతో పాటు కొన్ని బ్రోచర్లు ప్రజలకు అందజేసి వివరిస్తారు. వాటిల్లో ఉన్న ప్రశ్నల్ని చదివి ప్రజల అభిప్రాయం తెలుసుకుంటారు. ఆ సర్వేలో వారి అభిప్రాయంలో సీఎం జగన్‌ పాలనపై సంతృప్తి చెందిందే ఒక ముద్ర వేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు.

ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించే మరో కార్యక్రమం సచివాలయాల దగ్గర డిస్‌ప్లే బోర్డుల ప్రారంభిస్తారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ ఇన్ ఛార్జులు, ఆయా మండలాల పరిధిలోని గ్రామాల కీలక నేతలు పాల్గొంటారు. పార్టీ మండలాధ్యక్షుడి నాయకత్వంలో ఈ కార్యక్రమం జ‌రుగుతుంది. ప్రతీ సచివాలయాల దగ్గర ప్రభుత్వపరంగా ఏం చేశామనే డిస్‌ప్లే బోర్డుల్ని ప్రారంభోత్సవం చేస్తారు. డిస్‌ప్లే బోర్డుల్లో రియల్‌ డెవలప్‌మెంట్‌ గణాంకాలు ఉంటాయి. దీన్ని పబ్లిక్‌ ఫంక్షన్‌లా అధికారిక కార్యక్రమంగానే నిర్వహిస్తారు. మొత్తం 40 రోజుల పాటు జ‌రిగే కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేసేలా సీఎం జ‌గ‌న్ ఇప్పటికే పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేసారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..