డబ్బులు అడిగారో బుల్లెల్‌ దిగుద్ది.. అప్పులోళ్లను బెదిరించేందుకు అప్పు చేసి మరీ తుపాకీ కొన్న ఘనుడు.. చివరికీ..

అతనికి అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగారా 'నా చేతిలో ఏముందో చూడండి' అంటూ ఏకంగా తుపాకీతోనే బెదిరిస్తాడు. అన్నట్లు ఈ తుపాకీ కూడా అప్పు చేసి మరీ కొన్నదే. వినడానికి విచిత్రంగానే ఉన్నా ఇది నిజం. అనంతపురం రూరల్ ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దగ్గర తుపాకీ ఉన్న సంగతి తెలుసుకున్న పోలీసులు..

డబ్బులు అడిగారో బుల్లెల్‌ దిగుద్ది.. అప్పులోళ్లను బెదిరించేందుకు అప్పు చేసి మరీ తుపాకీ కొన్న ఘనుడు.. చివరికీ..
Gun (representative Image)
Follow us
Nalluri Naresh

| Edited By: Basha Shek

Updated on: Nov 09, 2023 | 6:40 AM

అతనికి అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగారా ‘నా చేతిలో ఏముందో చూడండి’ అంటూ ఏకంగా తుపాకీతోనే బెదిరిస్తాడు. అన్నట్లు ఈ తుపాకీ కూడా అప్పు చేసి మరీ కొన్నదే. వినడానికి విచిత్రంగానే ఉన్నా ఇది నిజం. అనంతపురం రూరల్ ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దగ్గర తుపాకీ ఉన్న సంగతి తెలుసుకున్న పోలీసులు అతని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం తెలిసింది. 34 లక్షల రూపాయల అప్పు చేసిన ఆ వ్యక్తి అప్పు ఇచ్చిన వాళ్లని బెదిరించడం కోసం తుపాకీ తెచ్చాడు అన్న సంగతి తెలుసుకున్న పోలీసులే షాక్ అయ్యారు. ఓబులేసు అనే వ్యక్తి అందిన కాడికి అప్పులు చేశాడు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఇక అప్పు తీర్చే మార్గం తెలియలేదు. దీంతో అతని స్నేహితుడు కన్నయ్య స్టుపిడ్ ఐడియా ఇచ్చాడు. తుపాకీ ఉంటే ఎవరూ మనల్ని డబ్బులు అడగరని ఒక కన్నింగ్ ఐడియా ఇచ్చాడు. అదేవిధంగా తనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఒక తుపాకీ ఉంది. అది కొని అప్పు ఇచ్చిన వాళ్ళు డబ్బులు అడిగితే బెదిరించొచ్చని సలహా ఇచ్చాడు కన్నయ్య. మరి తుపాకీ కొనడం ఎలాగా??? దీనికి కూడా పాతికవేల రూపాయలు అప్పు చేశాడు ఓబులేసు. ఇంకేముంది తన దగ్గర తుపాకీ ఉంది ఎవరన్నా డబ్బులు అడిగారా??? కాల్చిపడేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగలేదు. నాటు తుపాకీతో అక్రమ వసూళ్లకు పాల్పడితే అప్పుల బారి నుంచి బయటపడవచ్చు అని ఆలోచన చేశాడు ఓబులేసు.

అయితే మొత్తానికి మనోడి తుపాకీ ఐడియా బెడిసి కొట్టింది. విషయం పోలీసులకు తెలిసి తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఓబులేసు అతని స్నేహితుడు కన్నయ్యను అరెస్ట్ చేశారు. తుపాకీ అమ్మిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలి కానీ, తుపాకీతో బెదిరించడం కోసం అప్పు చేసి మరి తుపాకీ కొనడం ఏంటి??? చచ్చు ఐడియా కాకపోతే అని అంటున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి
Anantapur Police

Anantapur Police

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..