Tirumala: పవిత్రమైన తిరుమలను రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం: ఎంపీ జోగినపల్లి సంతోష్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండను రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కొండపై రాజకీయ విమర్శలు సరికాదన్నారు. ఆదివారం ఆయన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండను రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కొండపై రాజకీయ విమర్శలు సరికాదన్నారు. ఆదివారం ఆయన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రమని అన్నారు. కొందరు వ్యక్తులు కొండపై రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం, రాజకీయ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. భక్తి భావం తొణికిసలాడాల్సిన చోటును రాజకీయాలకు వేదికగా చేసుకోవడం భావ్యం కాదన్నారు. తిరుమల కొండ పవిత్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు చేసే వారిని నిరోధించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొండపై రాజకీయాలు చేయకుండా కఠిన నిబంధనలు రూపొందించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిని ఎంపీ కోరారు
కాగా తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు వంటివి వెళ్లకూడదనే నియమాలు ఉన్నాయి. అయితే కొంతకాలంగా తిరుమల కొండపై తరుచుగా విమానాలు వెళ్తున్నాయి. ఇటీవల మరోసారి తిరుమల కొండపై నుంచి విమానం వెళ్లింది. గత మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు విమానాలు తిరుమల శ్రీవారి దేవాలయం పైనుంచి వెళ్లడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రపతితో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
View this post on Instagram
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..