Meghana Raj: భర్త చనిపోయిన తర్వాత .. సిల్వర్‌ స్క్రీన్‌పై మళ్లీ మెరవనున్న ‘బెండు అప్పారావ్‌’ హీరోయిన్‌

మేఘనా రాజ్‌ తెలుగు సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది. అల్లరి నరేష్‌ నటించిన 'బెండు అప్పారావ్‌ ఆర్‌ఎంపీ' సినిమాతోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అందులో తనదైన అందం, అభియనంతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయి స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సొంత చేసుకుంది. మధ్యలో శ్రీకాంత్‌తో కలిసి లక్కీ అనే సినిమాలో నటించిందీ అందాల తార. సినిమాల్లో ఉండగానే నటుడు చిరంజీవి సర్జాను ప్రేమించి పెళ్లి చేసుకుంది

Meghana Raj: భర్త చనిపోయిన తర్వాత .. సిల్వర్‌ స్క్రీన్‌పై మళ్లీ మెరవనున్న 'బెండు అప్పారావ్‌' హీరోయిన్‌
Actress Meghana Raj
Follow us

|

Updated on: Sep 09, 2023 | 9:28 PM

ప్రముఖ కన్నడ నటి మేఘనా రాజ్ మళ్లీ వెండితెరపై అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఆమె నటించిన కన్నడ సినిమా ‘తత్సమ తద్భవ’ చిత్రం సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత నటిస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమా కోసం మేఘనా రాజ్ విసృథంగా ప్రమోషన్స్ చేస్తోంది. రిలీజ్‌ దగ్గర పడుతుండడంతో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజైంది. మేఘన భర్త, కన్నడ యాక్షన్‌ హీరో చిరంజీవి సర్జా 2020లో గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికే ఆమె గర్భంతో ఉండడం, భర్త హఠాన్మరణంతో మేఘన చాలా రోజుల డిప్రెషన్‌కు గురైంది. అయితే కొడుకు పుట్టిన తర్వాత కాస్త కోలుకుందామె. ఇప్పుడు కొడుకు బాగోగులు చూసుకోవడంతో పాటు సినిమా రంగంలోనూ బిజీగా ఉంది. ‘తత్సమ తద్భవ’ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. కాగా ‘తత్సమ తద్భవ’ అనేది క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ట్రైలర్‌లో ‘నా భర్త తప్పిపోయాడు’ అంటూ మేఘనా రాజ్ చెప్పిన లైన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమాలో ప్రజ్వల్ దేవరాజ్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. కాగా ఈ సినిమా రిలీజు దగ్గర పడుతున్న కొద్దీ మేఘన, ప్రజ్వల్, పన్నగా భరణ్‌లు వేర్వేరు కాలేజీలకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. మేఘనా రాజ్ కూడా సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా మేఘనా రాజ్‌ తెలుగు సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది. అల్లరి నరేష్‌ నటించిన ‘బెండు అప్పారావ్‌ ఆర్‌ఎంపీ’ సినిమాతోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అందులో తనదైన అందం, అభియనంతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయి స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సొంత చేసుకుంది. మధ్యలో శ్రీకాంత్‌తో కలిసి లక్కీ అనే సినిమాలో నటించిందీ అందాల తార. సినిమాల్లో ఉండగానే నటుడు చిరంజీవి సర్జాను ప్రేమించి పెళ్లి చేసుకుంది మేఘన. సుమారు పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2018 మేలో పెళ్లిపీటలెక్కింది. అయితే వివాహమై రెండేళ్లకే భర్తను కోల్పోయింది మేఘన. 2020 జూన్‌ 7న హీరో చిరంజీవి సర్జా కన్నుమూశాడు. అప్పటికే గర్భంతో ఉన్న మేఘన ఆ ఏడాది అక్టోబర్‌లోనే రాయన్‌ సర్జాకు జన్మనిచ్చింది.

మేఘనా రాజ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

View this post on Instagram

A post shared by Meghana Raj Sarja (@megsraj)

భర్త తో మేఘనా రాజ్

View this post on Instagram

A post shared by Meghana Raj Sarja (@megsraj)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ