AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRO OTT: ఓటీటీలో పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ ర్యాంపేజ్‌.. పాక్‌, బంగ్లాలో టాప్‌లో ట్రెండ్‌ అవుతోన్న మెగా మల్టీస్టారర్‌

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ బ్రో.. ది అవతార్‌ సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. ముందస్తు ఒప్పందం ప్రకారం ఆగస్టు 25న పవన్‌ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. రావడమే రికార్డులు మొదలు పెట్టిన పవన్‌ మూవీ గత వారం నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా ట్రెండింగ్స్‌లో టాప్‌లో నిలిచింది. తద్వారా పవన్‌ కల్యాణ్‌ పవర్‌ ఏంటో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. విశేషమేమిటంటే.. ఇండియాతో పాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లోనూ బ్రో సినిమాకు రికార్డ్‌ వ్యూస్‌ వస్తున్నాయి. ఇక రెండో వారంలోనూ..

BRO OTT: ఓటీటీలో పవన్‌ కల్యాణ్‌ 'బ్రో' ర్యాంపేజ్‌.. పాక్‌, బంగ్లాలో టాప్‌లో ట్రెండ్‌ అవుతోన్న మెగా మల్టీస్టారర్‌
Bro The Avatar Movie
Basha Shek
|

Updated on: Sep 08, 2023 | 8:57 PM

Share

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘ బ్రో.. ది అవతార్‌.. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వినోదయ సిత్తంకు ఇది రీమేక్‌. ఒరిజనల్‌లో నటించిన సముద్రఖని బ్రోను తెరకెక్కించాడు. ఈ సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కేతికా శర్మ, ప్రియాంకా వారియర్‌, వెన్నెల కిశోర్‌, రోహిణీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జులై 28న థియేటర్లలో విడుదలైన ఈ మెగా మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. పవన్‌ కల్యాణ్‌ వింటేజ్‌ స్టైల్‌, మ్యానరిజమ్స్‌కు తోడు ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉండడంతో మెగాభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపారు. థియేటర్లలో బాగా ఆడిన బ్రో ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ బ్రో.. ది అవతార్‌ సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. ముందస్తు ఒప్పందం ప్రకారం ఆగస్టు 25న పవన్‌ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. రావడమే రికార్డులు మొదలు పెట్టిన పవన్‌ మూవీ గత వారం నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా ట్రెండింగ్స్‌లో టాప్‌లో నిలిచింది. తద్వారా పవన్‌ కల్యాణ్‌ పవర్‌ ఏంటో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. విశేషమేమిటంటే.. ఇండియాతో పాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లోనూ బ్రో సినిమాకు రికార్డ్‌ వ్యూస్‌ వస్తున్నాయి. ఇక రెండో వారంలోనూ బ్రో తన జోరు కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇండియా వైడ్ తెలుగు సహా హిందీ వెర్షన్ లో టాప్- 1 అండ్ 3 స్థానాల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక బంగ్లాదేశ్ పాకిస్తాన్ లలో బ్రో హిందీ వెర్షన్‌ టాప్ 1 ప్లేస్ లో కొనసాగుతోంది.

ఇక మాల్దీవులు సహా మరికొన్ని దేశాల్లో బ్రో హిందీ వెర్షన్‌ టాప్- 10 లో ట్రెండ్‌ అవుతుండడం విశేషం. కాగా నెట్‌ఫ్లిక్స్‌ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో బ్రో మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. పీపుల్స్‌ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ మెగా మల్టీస్టారర్‌ను నిర్మించారు. థమన్‌ బీజీఎస్‌, స్వరాలు సమకూర్చారు. ముఖ్యంగా బ్రో థీమ్‌ సాంగ్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. బ్రో తర్వాత వరుసగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు పవన్‌. సుజిత్‌తో ఓజీ, హరీష్‌ శంకర్‌ తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, క్రిష్‌తో హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ లో బ్రో సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి