7:11 PM OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు టైమ్ ట్రావెల్ థ్రిల్లర్.. 7:11 PM మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
బాలకృష్ణ ఆదిత్య 369, సూర్య 24, ప్రశాంత్ వర్మ అ!, శర్వానంద్ ఒకే ఒక జీవితం, కల్యాణ్ రామ్ బింబిసార వంటి టైమ్ ట్రావెల్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ మధ్యన ఓటీటీలో రిలీజైన ప్లే బ్యాక్, తేజ సజ్జాల అద్భుతం సినిమాలకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలా టైమ్ ట్రావెల్‌కు కాస్త సైన్స్ ఫిక్షన్‌ను జోడించి తెరకెక్కిన సినిమా 7:11 PM. డైరెక్టర్ చైతు మాదాల తెరకెక్కించిన ఈ సినిమాలో సాహస్, దీపిక హీరో, హీరోయిన్లుగా నటించారు.
బాలకృష్ణ ఆదిత్య 369, సూర్య 24, ప్రశాంత్ వర్మ అ!, శర్వానంద్ ఒకే ఒక జీవితం, కల్యాణ్ రామ్ బింబిసార వంటి టైమ్ ట్రావెల్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ మధ్యన ఓటీటీలో రిలీజైన ప్లే బ్యాక్, తేజ సజ్జాల అద్భుతం సినిమాలకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలా టైమ్ ట్రావెల్‌కు కాస్త సైన్స్ ఫిక్షన్‌ను జోడించి తెరకెక్కిన సినిమా 7:11 PM. డైరెక్టర్ చైతు మాదాల తెరకెక్కించిన ఈ సినిమాలో సాహస్, దీపిక హీరో, హీరోయిన్లుగా నటించారు. జూలై 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. కాన్సెప్ట్ బాగుందని ప్రశంసలు వచ్చినా ప్రమోషన్లు పెద్దగా లేకపోవడంతో మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయతే ప్రముఖ మూవీ రివ్యూ వెబ్ సైట్ 7:11 PM సినిమాకు ఏకంగా 7.5 రేటింగ్ ఇవ్వడం విశేషం. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 7:11 PM సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
సినిమా కథ ఏంటంటే?. ఇటీవల థియేటర్లలో పెద్దగా హిట్ కానీ సినిమాలు ఓటీటీలో మాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. మరి ఈ టైమ్ ట్రావెల్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా ఓటీటీలో ఆకట్టుకుంటుందా?లేదా? చూడాలి. సినిమా కథ విషయానికి వస్తే 1999లో ఇది జరుగుతుంది. హంసల దీవికి చెందిన రవి (సాహస్) ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతుంటాడు. ఎమ్మెల్యే సోదరి విమల (దీపిక)ను లవ్ చేస్తాడు. అదే సమయంలో ఒక మ్యూచులవ్ ఫండ్స్ కంపెనీ ఊర్లో వాళ్ల డబ్బంతా దోచుకోవడానికి రెడీ అవుతుంది. ఈ విషయంతెలుసుకున్న రవి అందరినీ కాపాడాలనుకుంటాడు. అనుకోకుండా బస్ రూపంలో ఉన్న టైమ్ మిషన్‌ను ఎక్కుతాడు. 1999 నుంచి 2024 కాలంలోకి వస్తాడు. మరి ఆ తర్వాత రవికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెలుసుకోవాలంటే 7:11 PM మూవీని చూడాల్సిందే.
డాక్టర్ భరత్ రెడ్డి, టెస్ వాల్ష్, రఘు కారుమంచి, చరణ్ కురుగొండ, రైజింగ్ రాజు తదితరులు 7:11 PM సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.ఆర్కస్ ఫిల్మ్స్ బ్యానర్‍పై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి ఈ సినిమాను నిర్మించారు. గ్యాని స్వరాలు సమకూర్చారు. శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేశారు. మరి 7:11 సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి..
అమెజాన్ ప్రైమ్ లో తెలుగు టైమ్ ట్రావెలర్ మూవీ..
Telugu film “7:11 PM” is now streaming on Amazon Prime Video. pic.twitter.com/Xaf6ZtZDZA
— Ur’sVenky (@VKUrsVenky1) September 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..