Bigg Boss 7 Telugu: హౌజ్‌లో ఇలా చేస్తే ముందుగానే బయటకు పోతావ్‌.. శోభాశెట్టికి నాగార్జున క్లాస్

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోన్న బిగ్‌బాస్‌ 7 తెలుగు సీజన్‌ స్లోగా పికప్‌ అవుతోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు టైటిల్‌ కోసమే వచ్చామంటూ తమదైన శైలిలో టాస్కులు, గేమ్స్‌ ఆడుతున్నారు. రియాల్టీ షో ప్రారంభమై వారం పూర్తికావొచ్చింది. దీంతో ఎప్పటిలాగే వీకెండ్‌లో హోస్ట్‌ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. గత వారం రోజులుగా హౌజ్‌లో జరుగుతున్న పరిణామాలను గుర్తుచేసిన ఆయన హౌజ్‌మేట్స్‌కు సున్నితంగానే కౌంటర్లు వేశారు.

Bigg Boss 7 Telugu: హౌజ్‌లో ఇలా చేస్తే ముందుగానే బయటకు పోతావ్‌.. శోభాశెట్టికి నాగార్జున క్లాస్
Bigg Boss Telugu 7
Follow us
Basha Shek

|

Updated on: Sep 09, 2023 | 8:24 PM

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోన్న బిగ్‌బాస్‌ 7 తెలుగు సీజన్‌ స్లోగా పికప్‌ అవుతోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు టైటిల్‌ కోసమే వచ్చామంటూ తమదైన శైలిలో టాస్కులు, గేమ్స్‌ ఆడుతున్నారు. రియాల్టీ షో ప్రారంభమై వారం పూర్తికావొచ్చింది. దీంతో ఎప్పటిలాగే వీకెండ్‌లో హోస్ట్‌ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. గత వారం రోజులుగా హౌజ్‌లో జరుగుతున్న పరిణామాలను గుర్తుచేసిన ఆయన హౌజ్‌మేట్స్‌కు సున్నితంగానే కౌంటర్లు వేశారు. ‘నాకు తెలిసి.. బిగ్‌బాస్‌ 13 మందే హౌజ్‌మేట్స్‌ ఉన్నారు. పూర్తిగా ఇంగ్లిష్‌లో మాట్లాడే.. కిరణ్ రాథోడ్‌ని నేను లెక్కలోకి తీసుకోవడం లేదు.. నువ్వు ఒక పది పదాలు తెలుగులో మాట్లాడు’ అని పంచులేస్తూనే సవాల్‌ విసిరాడు. దీంతో పాపం ఆమె ఇబ్బంది పడుతూనే తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసింది. అలాగే రాత్రి వేళల్లో షకీలా చేసిన హంగామాపై ‘షకీ అమ్మా ఎలా ఉన్నారు’ అన్నారు. వీరు మాట్లాడుతూ ఉండగానే మధ్యలో కలగజేసుకున్నాడు టేస్టీ తేజా. ఆమె (షకీలా) బాగానే ఉన్నారు.. సార్ మమ్మల్నే వణికిస్తున్నారు? అన్నాడు తేజా. అలాగే ఆట సందీప్‌, రతిక చెప్పులు మోసాడంటూ ఆటపట్టించే ప్రయత్నం చేశారు నాగ్‌ . ఇక ప్రియాంక, దామినీల గొడవపై స్పందిస్తూ ఇద్దరికీ ఇచ్చిపడేశాడు. గౌతమ్‌పై కూడా భలే సెటైర్లు వేశారు. హౌస్‌లో మాటిమాటికి కన్నీళ్లు పెట్టుకుంటున్న శోభా శెట్టిపై తనదైన శైలిలో కౌంటర్‌ వేశారు నాగ్. ‘ఫస్ట్‌ వీక్‌ నుంచి కన్నీళ్లు పెట్టుకునే కంటెస్టెంట్‌ని ఆడియెన్స్‌.. టాప్‌-5 కి పంపిన దాఖాలాలు ‘ లేవు అని నాగ్‌ చెప్పారు. గౌతమ్‌ని ఉద్దేశిస్తూ నువ్వు హౌస్‌లో ఉన్నావా? లేక ఒకరి వెంటే ఉన్నావా? అంటూ నాగ్‌ సెటైర్లు వేశారు. అదే సమయంలో శుభ శ్రీ వయ్యారాలు పోతూ తెగ సిగ్గుపడిపోయింది. వీరితో పాటు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, ప్రియాంక, దామినీల మధ్య జరిగిన గొడవపై తనదైన శైలిలో కౌంటర్లు వేశారు నాగ్. బాడీ బిల్డర్.. యావర్‌ని అయితే ఓవర్ ఎక్స్ పోజింగ్ గురించి చురకలేశారు. మరి నాగ్‌ స్టేట్‌మెంట్స్‌తో హౌజ్‌మెట్స్‌ మారతారా? లేక తమకు నచ్చిన శైలిలోనే వ్యవహరిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

కాగా బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ఎపిపోడ్స్‌ ప్రతిరోజూ స్టార్‌ మా ఛానెల్‌లో ప్రసారమవుతున్నాయి. అదే సమయంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల స్ట్రీమింగ్‌ అందుబాటులో ఉంది. అయితే రోజంతా లైవ్‌ స్ట్రీమింగ్ ఇవ్వడం వల్ల బిగ్‌బాస్‌ హౌజ్‌లో కిక్‌ ఉండడం లేదంటున్నారు నిర్వాహకులు. టాస్క్‌లు, గేమ్స్‌ ముందుగానే తెలిసిపోతాయంటున్నారు . అందుకే శనివారం, ఆదివారాల్లో 24 గంటల స్ట్రీమింగ్‌ ఉండదని ప్రకటించారు. అంటే మళ్లీ ఆదివారం రాత్రి 10.30 గంటల తర్వాతే 24 గంటల స్ట్రీమింగ్‌ అందుబాటులోకి వస్తుందన్నమాట.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో చూశారా? 

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?