- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Fame Deepthi Sunaina Rubbishes Her Road Accident News In Social Media
Deepthi Sunaina: బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనాకు కార్ యాక్సిడెంట్! అసలు ఏం జరిగిందంటే?
దీప్తి సునైనాకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌తో మరింత పాపులర్ అయ్యింది. వీటన్నిటికీ మించి షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమ, రిలేషన్ షిప్ వ్యవహారాలు ఆమెను తరచూ వార్తల్లో నిలిపాయి.
Updated on: Sep 09, 2023 | 10:36 PM

దీప్తి సునైనాకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌తో మరింత పాపులర్ అయ్యింది. వీటన్నిటికీ మించి షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమ, రిలేషన్ షిప్ వ్యవహారాలు ఆమెను తరచూ వార్తల్లో నిలిపాయి.

అదే సమయంలో మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచిందీ అందాల తార. అయితే కొన్ని కారణాలతో అతనికి బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం ఎవరికి వాళ్లు తమ కెరీర్‌తో బిజిబిజీగా ఉంటున్నారు.

దీప్తి గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగవైరలవుతోంది. రోడ్డు ప్రమాదంలో సునైనా గాయపడిందనే పుకార్లు ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేశాయి.

తాజాగా ఈ రూమర్లపై స్పందించింది దీప్తి సునయన. 'నాకు కారు ప్రమాదం జరిగిందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. నేనైతే ప్రస్తుతం పూర్తి క్షేమంగానే ఉన్నాను. మూడేళ్ల క్రితం 'అలియా ఖాన్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. అందులో కొన్ని క్లిప్స్‌తో ఇప్పుడు ఇలాంటి వదంతులు క్రియేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు' అని దీప్తి క్లారిటీ ఇచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో దీప్తి సునయన రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఫ్యాన్స్ రిలీఫ్ అవుతున్నారు.