- Telugu News Photo Gallery Cinema photos Kiran Abbavaram Rules Ranjann Trailer Released Jawan Movie Record Openings
ఫుల్ ఫన్ మోడ్‌లో రూల్స్ రంజన్ ట్రైలర్.. రికార్డు ఓపెనింగ్స్‌తో జవాన్
ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నటుడు జి.మరిముత్తు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. చివరగా జైలర్ సినిమాలో విలన్‌కు నమ్మకస్తుడి పాత్రలో నటించారాయన. గతేడాది విక్రమ్‌లోనూ కీలక పాత్రలో కనిపించారు. అంతేకాదు.. సూర్య కంగువా ఆయన చివరి సినిమా. ‘ఎథిర్ నీచల్’ పేరుతో ఒక టెలివిజన్ షో చేస్తున్నారు మరిముత్తు. స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్న సమయంలో.. తీవ్ర గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన వయసు 56 ఏళ్ళు.
Updated on: Sep 09, 2023 | 1:35 PM

Marimuthu: ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నటుడు జి.మరిముత్తు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. చివరగా జైలర్ సినిమాలో విలన్‌కు నమ్మకస్తుడి పాత్రలో నటించారాయన. గతేడాది విక్రమ్‌లోనూ కీలక పాత్రలో కనిపించారు. అంతేకాదు.. సూర్య కంగువా ఆయన చివరి సినిమా. ‘ఎథిర్ నీచల్’ పేరుతో ఒక టెలివిజన్ షో చేస్తున్నారు మరిముత్తు. స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్న సమయంలో.. తీవ్ర గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన వయసు 56 ఏళ్ళు.

Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదలైంది. మొదటి రోజు ఈ సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ వచ్చాయి. కేవలం తెలుగులోనే దాదాపు 10 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయగా.. మొత్తం సౌత్‌లో 22 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బాలీవుడ్‌లో మొదటి రోజు 65 కోట్ల నెట్ వచ్చింది. పఠాన్ తర్వాత మరోసారి 1000 కోట్లపై కన్నేసారు కింగ్ ఖాన్.

Rules Ranjan: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా దర్శకుడు రత్నం కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా రూల్స్ రంజన్. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ ఫుల్ ఫన్ మోడ్‌లో ఉంది. ఎంటర్‌టైన్మెంట్ బేస్ చేసుకుని రూల్స్ రంజన్ సినిమా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. మాస్ ఎలిమెంట్స్ పక్కనబెట్టి పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు కిరణ్.

Salaar: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో అదే రోజు రావడానికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే సలార్ నవంబర్ 10న విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Drohi: సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ద్రోహి’. ది క్రిమినల్ అన్నది ట్యాగ్ లైన్. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ప్రముఖ దర్శకులు క్రిష్ చేతుల మీదుగా విడుదలైంది. సినిమా చాలా బాగుంటుందని నమ్మకంగా చెప్పారీయన. ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుందని చెప్పారు క్రిష్.




