Jawan- Rajamouli: ‘నేను కూడా మాస్ హీరో అని చెప్పండి’.. జవాన్‌కు రివ్యూ ఇచ్చిన జక్కన్నకు షారుక్‌ రిప్లై ఇదే..

సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా గురువారం (సెప్టెంబర్‌ 7) విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా జవాన్ నిలిచింది. ఈ చిత్రానికి అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సామాన్య ప్రజలే కాకుండా ఇతర తారలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆస్కార్ విజేత ఎస్ఎస్ రాజమౌళి కూడా షారుఖ్ ఖాన్ జవాన్ పై ప్రశంసలు కురిపించారు.

Jawan- Rajamouli: 'నేను కూడా మాస్ హీరో అని చెప్పండి'.. జవాన్‌కు రివ్యూ ఇచ్చిన జక్కన్నకు షారుక్‌ రిప్లై ఇదే..
Rajamouli, Shah Rukh Khan
Follow us
Basha Shek

|

Updated on: Sep 08, 2023 | 9:27 PM

సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా గురువారం (సెప్టెంబర్‌ 7) విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా జవాన్ నిలిచింది. ఈ చిత్రానికి అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సామాన్య ప్రజలే కాకుండా ఇతర తారలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆస్కార్ విజేత ఎస్ఎస్ రాజమౌళి కూడా షారుఖ్ ఖాన్ జవాన్ పై ప్రశంసలు కురిపించారు. షారుక్ ఖాన్ సినిమా జవాన్ పై రాజమౌళి సోషల్ మీడియాలో స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ‘ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ రారాజు కావడానికి ఇదే కారణం. ప్రకంపనలు సృష్టించేలా అద్భుతమైన ఓపెనింన్స్‌. సౌత్ సక్సెస్‌ను నార్త్‌లో కొనసాగించిన అట్లీకి అభినందనలు. ఈ అద్భుతమైన విజయాన్ని అందించినందుకు జవాన్‌ మొత్తం టీమ్‌కు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు దర్శక ధీరుడు. ఇక జక్కన్న పోస్టుపై షారుక్‌ ఖాన్‌ స్పందించారు. ‘చాలా ధన్యవాదాలు సార్. మేమంతా మీ సినిమాల్లో క్రియేటివిటీని చూసి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దయచేసి మీకు వీలు కుదిరినప్పుడు జవాన్‌ సినిమాను చూడండి. అప్పుడు నాకు ఫోన్ చేసి నేను కూడా మాస్ హీరో కాగలనో లేదో చెప్పు. హ హ.. ప్రేమతో మీకు ధన్యవాదాలు’ అని షారుక్‌ ఖాన్‌ రిప్లై ఇచ్చారు.

కోలీవుడ్‌ యంగ్‌ అండ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన జవాన్‌ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వీరితో పాటు వెర్సటైల్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సంజయ్‌ దత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. షారుక్‌ సొంత సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై గౌరీఖాన్‌ జవాన్‌ సినిమాను నిర్మించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. ఇక జవాన్ మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద హిందీ భాషలో 65.50 కోట్లు వసూలు చేసింది షారుక్‌ మూవీ . అలాగే మిగతా భారతీయ భాషల్లో ఈ సినిమా కలెక్షన్లు 75 కోట్లు వచ్చాయి. అంతే కాకుండా విదేశాల్లో ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 130 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందంలోని సునీల్ గ్రోవర్ కూడా ధృవీకరించారు.

ఇవి కూడా చదవండి

రాజమౌళి- షారుక్ ల ఛాటింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..