AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer: జైలర్‌ నిర్మాతల గొప్ప మనసు.. ఉపాసన తాతయ్యకు కోటి రూపాయల విరాళం.. ఎందుకో తెలుసా?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'జైలర్' సినిమా బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. ఆగస్టు 10న విడుదలైన ఈ యాక్షన్‌ ఎంట్‌టైనర్‌ ఇప్పటికే రూ. 650 కోట్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. సినిమా బ్లాక్‌ బస్టర్‌ కావడంతో నిర్మాతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌కు మించి భారీగా లాభాలు రావడంతో ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటోంది సన్ పిక్చర్స్ సంస్థ.

Jailer: జైలర్‌ నిర్మాతల గొప్ప మనసు.. ఉపాసన తాతయ్యకు కోటి రూపాయల విరాళం.. ఎందుకో తెలుసా?
Kaveri Kalanidhi, Apollo Pratap Reddy, Upasna
Basha Shek
|

Updated on: Sep 06, 2023 | 11:08 AM

Share

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. ఆగస్టు 10న విడుదలైన ఈ యాక్షన్‌ ఎంట్‌టైనర్‌ ఇప్పటికే రూ. 650 కోట్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. సినిమా బ్లాక్‌ బస్టర్‌ కావడంతో నిర్మాతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌కు మించి భారీగా లాభాలు రావడంతో ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటోంది సన్ పిక్చర్స్ సంస్థ. జైలర్‌ సక్సెస్‌లో కీ రోల్‌ పోషించిన హీరో రజనీకాంత్, డైరెక్టర్‌ దిలీప్‌ నెల్సన్‌ కుమార్, మ్యూజిక్‌ డైరెక్టర్లు అనిరుధ్‌లకు ఖరీదైన బహుమతులను ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్‌. రజనీకాంత్‌కు చెక్‌తో పాటు రూ.1.55 కోట్లు విలువచేసే BMW X7 కారును కానుకగా ఇస్తే, నెల్సన్‌, అనిరుధ్‌లకు కోటి రూపాయల పోర్షే మకాన్ లగ్జరీ కార్లతో పాటు పెద్ద మొత్తంలో చెక్‌ను అందించారు. అయితే జైలర్‌ సినిమాతో వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు మారన్. ఇందులో భాగంగానే అపోలో ఆస్పత్రికి కోటి రూపాయలను విరాళంగా అందించారు. తాజాగా దీనికి సంబంధించిన చెక్‌ను అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌, డాక్టర్‌ ప్రతాప్‌ చంద్రారెడ్డిని కలిసి అందించారు కళానిధి మారన్ భార్య కావేరి. ఈ విషయాన్ని 100 మంది నిరుపేద పిల్లల గుండె శస్త్రచికిత్సల కోసం ఈ విరాళం మొత్తాన్ని అందజేసినట్లు తమ అధికారిక ట్విట్టర్‌లో తెలిపింది సన్‌పిక్చర్స్‌ సంస్థ. దీంతో సోషల్‌ మీడియాలో జైలర్‌ నిర్మాతలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పేద పిల్లల హార్ట్‌ సర్జరీల కోసం సన్‌పిక్చర్స్‌ సంస్థ చాలా మంచి నిర్ణయం తీసుకుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరికొన్ని గంటట్లో ఓటీటీలోకి..

థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన జైలర్‌ మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఇవాళ్టి అర్ధరాత్రి నుంచి రజనీ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతోపాటు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలియజేశారు మేకర్స్. ఇక జైలర్‌ సినిమాలో రజనీతో పాటు శివరాజ్‌కుమార్, మోహన్‌ లాల్‌, జాకీ ష్రాఫ్‌, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, వినాయకన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రజనీ నటనతో పాటు అనిరుధ్ అందించిన బీజీఎస్‌ సినిమాను నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి

చిన్నారుల గుండె సర్జరీల కోసం కోటి రూపాయల విరాళం

View this post on Instagram

A post shared by Sun Pictures (@sunpictures)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..