AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: గోవింద కోటి రాస్తే ఫ్యామిలీ మొత్తానికి వీఐపీ బ్రేక్‌ దర్శనం.. టీటీడీ పాలక మండలి తాజా సంచలన నిర్ణయాలివే

27 మంది సభ్యులు హాజరైన పాలకమండలి తొలి సమావేశంలోనే తిరుగులేని నిర్ణయాలు ప్రకటించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. ఈ సారి ఆయన అందుకున్న కొత్త నినాదం యువ గోవిందం. గోవింద కోటి రాస్తే కుటుంబం మొత్తానికి వీఐపీ బ్రేక్‌ దర్శనం.. పది లక్షల మార్లు గోవింద కోటి రాస్తే ఒక్కరికి దర్శనం కల్పించాలని నిర్ణయించింది టీటీడీ ధర్మకర్తల మండలి. భగవద్గీత సారాంశాన్ని 20 పేజీల పుస్తకంగా ముద్రించి..

Tirumala: గోవింద కోటి రాస్తే ఫ్యామిలీ మొత్తానికి వీఐపీ బ్రేక్‌ దర్శనం.. టీటీడీ పాలక మండలి తాజా సంచలన నిర్ణయాలివే
Ttd ChairmanBhumana Karunakar Reddy
Follow us
Basha Shek

|

Updated on: Sep 05, 2023 | 10:23 PM

27 మంది సభ్యులు హాజరైన పాలకమండలి తొలి సమావేశంలోనే తిరుగులేని నిర్ణయాలు ప్రకటించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. ఈ సారి ఆయన అందుకున్న కొత్త నినాదం యువ గోవిందం. గోవింద కోటి రాస్తే కుటుంబం మొత్తానికి వీఐపీ బ్రేక్‌ దర్శనం.. పది లక్షల మార్లు గోవింద కోటి రాస్తే ఒక్కరికి దర్శనం కల్పించాలని నిర్ణయించింది టీటీడీ ధర్మకర్తల మండలి. భగవద్గీత సారాంశాన్ని 20 పేజీల పుస్తకంగా ముద్రించి.. తెలుగు నాట అన్ని విద్యాలయాల్లో పంచిపెట్టాలనేది టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తీసుకున్న మరో కీలక నిర్ణయం. మొత్తంగా యువతలో ఆధ్యాత్మిక చింతన పెంచాలని, ఈవిధంగా సనాతన ధర్మాన్ని రాబోయే తరాలకు దగ్గరగా తీసుకెళ్లాలని కంకణం కట్టుకుంది టీటీడీ ధర్మకర్తల మండలి . ఇక అలిపిరి నడక మార్గంలో చిరుతల కలకలంపై కూడా చర్చించింది పాలకమండలి. ఇప్పటికే అమల్లో ఉన్న ఆంక్షల్ని ఇంకా పగడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది టీటీడీ . చేతికర్రల పంపిణీపై త్వరలోనే కీలక  నిర్ణయం తీసుకోనుంది టీటీడీ. అటు.. టీటీడీ క్వార్టర్ల ఆధునీకరణకు 49.5 కోట్లు ఖర్చుపెట్టాలని నిర్ణయించింది టీటీడీ పాలకమండలి. ముంబైలో కోటీ 65 లక్షల రూపాయల ఖర్చుతో మరో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది టీటీడీ. వీటన్నింటి కంటే ముఖ్యంగా.. యువ గుండెల్లో సనాతన ధర్మం నాటుకునేలా నిర్ణయాలు తీసుకోవడమే టీటీడీ కొత్త పాలకమండలి తాజా సంచలనం.

మరోసారి భూమన కరుణాకర రెడ్డి సంచలన నిర్ణయాలు..

కాగా ఈ నిర్ణయాలతో టీటీడీలో మరోసారి తనదైన ముద్రను వేసుకోబోతున్నారు కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. తన అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశంలోనే ఆ మేరకు సంకేతాలిచ్చేశారు. గతంలో తను ఛైర్మన్‌గా ఉన్నప్పుడు దళిత గోవిందం..  కల్యాణమస్తు లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో టీటీడీలో చైతన్యం నింపారు భూమన. ఇప్పుడు రెండో దఫా… యువ గోవిందం పేరుతో మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. యువతలో హైందవ భక్తివ్యాప్తిని పెంపొందించడం టీటీడీ ధ్యేయం అంటున్నారు. హైందవుల్లో రామకోటి రాయడం గొప్ప సంప్రదాయం. అదే కోవలో గోవింద కోటి ఎందుకు రాయకూడదు.. వెంకటేశ్వరుని ఆదేశంగా దాన్ని ఎందుకు పాటించకూడదు అని ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, చిరుతల కలకలం, భక్తుల భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు, టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల పంపిణీ.. ఈ ఎజెండాతో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం.. యువ గుండెల్లో సనాతన ధర్మం నాటడమే లక్ష్యంగా చర్చించినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి