AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: అల్లు అర్జున్‌ సినిమాకు ఇంత క్రేజ్‌ ఏంటి సామీ.. పుష్ప 2 సినిమాకు ఏకంగా 1000 కోట్ల ఆఫర్‌

2021 డిసెంబర్‌లో విడుదలైన పుష్ప బాక్సాఫీస్‌ రికార్డుల దుమ్ము దులిపింది. తెలుగుతో పాటు హిందీ తదితర భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. ఊరమాస్‌ లుక్‌లో బన్నీ స్టైల్‌, డైలాగ్స్‌, మేనరిజమ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. ఇదే సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు అల్లు అర్జున్‌. దీంతో పుష్ప సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి.

Pushpa 2: అల్లు అర్జున్‌ సినిమాకు ఇంత క్రేజ్‌ ఏంటి సామీ.. పుష్ప 2 సినిమాకు ఏకంగా 1000 కోట్ల ఆఫర్‌
Allu Arjun Pushpa 2 Movie
Basha Shek
|

Updated on: Sep 04, 2023 | 8:21 PM

Share

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. క్రేజీ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా, సమంత ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. 2021 డిసెంబర్‌లో విడుదలైన పుష్ప బాక్సాఫీస్‌ రికార్డుల దుమ్ము దులిపింది. తెలుగుతో పాటు హిందీ తదితర భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. ఊరమాస్‌ లుక్‌లో బన్నీ స్టైల్‌, డైలాగ్స్‌, మేనరిజమ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. ఇదే సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు అల్లు అర్జున్‌. దీంతో పుష్ప సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పుష్ప 2 ది రూల్‌ నుంచి రిలీజైన అల్లు అర్జున్‌ ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్‌ రానున్నాయి. కాగా రిలీజుకు ముందే రికార్డులు కొల్లగొడుతోంది పుష్ప 2. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మేకింగ్‌ దశలోనే పుష్ప2 కి అదిరిపోయే ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. హిందీ రిలీజ్‌కు సంబంధించి బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏకంగా రూ. 1000 కోట్లను ఆఫర్ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.

బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్

పుష్ప 2 హిందీ సినిమాకు సంబంధించి థియేట్రికల్‌, ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్‌కు సంబంధించిన అన్ని రకాల హక్కులను తమకే ఇవ్వాలంటూ, ఇందుకోసం ఏకంగా రూ. 1000 కోట్లు ఇస్తామంటూ సదరు డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ముందుకు వచ్చినట్లు సమాచారం. మరి ఈ క్రేజీ ఆఫర్‌కు పుష్ప మేకర్స్‌ ఎలా రియాక్ట్‌ అయ్యారు? అసలు ఈ వార్తల్లో నిజమెంత? అబద్ధమెంత? అన్నది తెలియాల్సి ఉంది. కాగా అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని పుష్ప 2 ను మరింత శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారట సుకుమార్‌. మొదటి పార్ట్‌ను మించి సీక్వెల్‌ హిట్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారట. పుష్ప 1లో నటించిన అనసూయ, సునీల్, ఫహాద్‌ ఫాసిల్‌ సీక్వెల్‌లోనూ నటించనున్నారు. వీరితో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన మరికొద్ది మంది ప్రముఖ నటులు ఈ సీక్వెల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పుష్ప 2 సినిమా సెట్ లో అల్లు అర్జున్, సుకుమార్

View this post on Instagram

A post shared by Sukumar B (@aryasukku)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌