- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda is talk of the town with hit talk on his new movie Kushi with Samantha
Vijay Deverakonda: ఫామ్‌లోకి వచ్చిన ‘రౌడీ’ బాయ్.. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ‘ఖుషీ’
ఐదేళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న రౌడీ ఫ్యాన్స్ ఖుషీ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత హిట్ సౌండ్ వినిపించటంతో విజయ్ దేవరకొండ, సమంత కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సినిమాను ఆడియన్స్‌ను మరింత చేరువ చేసేందుకు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. ఖుషి సినిమాతో మోస్ట్ నీడెడ్ హిట్ అందుకున్నారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. లైగర్ ఫెయిల్యూర్‌ను మరిపించే బిగ్ హిట్ దక్కటంతో సక్సెస్ జోష్‌లో ఉన్నారు.
Updated on: Sep 04, 2023 | 8:11 PM

ఐదేళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న రౌడీ ఫ్యాన్స్ ఖుషీ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత హిట్ సౌండ్ వినిపించటంతో విజయ్ దేవరకొండ, సమంత కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సినిమాను ఆడియన్స్‌ను మరింత చేరువ చేసేందుకు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు.

ఖుషి సినిమాతో మోస్ట్ నీడెడ్ హిట్ అందుకున్నారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. లైగర్ ఫెయిల్యూర్‌ను మరిపించే బిగ్ హిట్ దక్కటంతో సక్సెస్ జోష్‌లో ఉన్నారు. అంతేకాదు ఈ సక్సెస్‌ను అభిమానులతో సెలబ్రేట్ చేసుకునేందుకు వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్‌లో హల్‌చల్ చేస్తున్నారు.

సినిమా రిలీజ్ తరువాత సమంత విదేశాలకు వెళ్లిపోవటంతో ఇక్కడ ప్రమోషన్ బాధ్యతలను సోలోగా హ్యాండిల్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఆదివారం లక్ష్మీ నరసింహా స్వామి దర్శనం చేసుకున్న విజయ్, సాయంత్రం కింగ్ నాగార్జునతో కలిసి బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేశారు.

విజయ్ మాత్రమే కాదు విదేశాల్లో ఉన్న సమంత కూడా సినిమా ప్రమోషన్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. తాజాగా యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్‌తో కలిసి ఖుషి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న సామ్, సెల్ఫీ వీడియోతో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. యూఎస్‌లో ఉన్నా ఖుషి వైబ్‌ను కంటిన్యూ చేస్తున్నారు ఈ బ్యూటీ.

సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో వసూళ్ల పరంగానూ నయా రికార్డ్స్ సెట్ చేస్తోంది. రెండు రోజుల్లో 50 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది ఖుషి. సండే కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో తొలి వారాంతానికి వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.




