- Telugu News Photo Gallery Cinema photos Anurag Kashyap says his movies don't have budget to cast Alia Bhatt
Tollywood News: అలియాతో సినిమా.. అంత బడ్జెట్ లేదమ్మా అంటున్న డైరెక్టర్..!
లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ మూవీ చంద్రముఖి 2. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చంద్రముఖికి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సెప్టెంబర్ 15న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ మూవీకి పీ వాసు దర్శకుడు. బ్లాక్ బస్టర్ దృశ్యం కాంబినేషన్‌లో మరో మూవీ రానుంది. మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న నెక్ట్స్ మూవీకి నేరు అనే టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారు.
Updated on: Sep 04, 2023 | 8:00 PM

Chandramukhi 2: లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ మూవీ చంద్రముఖి 2. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చంద్రముఖికి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సెప్టెంబర్ 15న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ మూవీకి పీ వాసు దర్శకుడు.

Drishyam: బ్లాక్ బస్టర్ దృశ్యం కాంబినేషన్‌లో మరో మూవీ రానుంది. మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న నెక్ట్స్ మూవీకి నేరు అనే టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారు. తాజాగా ఈ సినిమా టీమ్‌తో జాయిన్ అయ్యారు మోహన్‌లాల్. వృషభ షెడ్యూల్ పూర్తి కావటంతో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నేరు వర్క్ స్టార్ట్ చేశారు.

Suhana Khan: ది ఆర్చిస్ మూవీతో యాక్టింగ్ డెబ్యూకి రెడీ అవుతున్న సుహాన ఖాన్, సెకండ్ మూవీలోనే తండ్రి షారూఖ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో షారూఖ్, సుహానా కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలో సుహాన, స్పై రోల్‌లో కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది.

Anurag Kashyap: అలియా భట్‌కు జాతీయ ఉత్తమ నటి అవార్డు రావటంపై స్పందించిన అనురాగ్ కశ్యప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె నిజంగానే గొప్ప నటి అన్న అనురాగ్, తన సినిమాల్లో హీరోయిన్‌గా ఆమెను తీసుకునేంత బడ్జెట్ మాత్రం తనకు లేదన్నారు. బడ్జెట్ సహకరిస్తే అలియాతో సినిమా చేసేందుకు రెడీ అన్నారు అనురాగ్ కశ్యప్.

Gadar 2: బాలీవుడ్‌లో గదర్ 2 జోరు కంటిన్యూ అవుతోంది. ఆదివారం 500 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా ఈ ఘనత సాధించిన మూడో బాలీవుడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు బాహుబలి 2, పఠాన్ మాత్రమే కేవలం బాలీవుడ్ మార్కెట్‌లో 500 కోట్లు వసూళ్ల మార్క్‌ను క్రాస్ చేశాయి. ఇప్పుడు ఈ సూపర్ హిట్స్ సరసన చేరింది గదర్ 2.




