AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bambai Meri Jaan: ఓటీటీలో మరో ఇంటెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. ‘బంబై మేరీ జాన్’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఓటీటీ సంస్థలు కూడా వీటిపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాయి. ఆసక్తికరమైన కంటెంట్‌తో క్రైమ్‌ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. అలా మరో ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. బాలీవుడ్ సీనియర్‌ నటులు కేకే మేనన్‌, అవినాష్‌ తివారీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్‌ బంబై మేరీ జాన్‌. షుజాత్‌ సౌదాగర్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌, గ్లింప్స్‌ ఆసక్తిని పెంచాయి.

Bambai Meri Jaan: ఓటీటీలో మరో ఇంటెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. 'బంబై మేరీ జాన్' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Bambai Meri Jaan Web Series
Basha Shek
|

Updated on: Sep 04, 2023 | 7:42 PM

Share

ఇటీవల ఓటీటీలో క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లకు బాగా క్రేజ్‌ పెరిగింది. నాటి మీర్జాపూర్‌ నుండి నేటి గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ వరకు.. అన్ని క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లు సూపర్‌హిట్‌గా నిలిచాయి. రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకున్నాయి. అందుకే స్టార్‌ హీరోలు వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటే, పేరున్న దర్శకులు సైతం వీటిని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఓటీటీ సంస్థలు కూడా వీటిపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాయి. ఆసక్తికరమైన కంటెంట్‌తో క్రైమ్‌ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. అలా మరో ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. బాలీవుడ్ సీనియర్‌ నటులు కేకే మేనన్‌, అవినాష్‌ తివారీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్‌ బంబై మేరీ జాన్‌. షుజాత్‌ సౌదాగర్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌, గ్లింప్స్‌ ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ క్రైమ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ముంబై వేదికగా ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. 1960లో బాంబే పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా బంబై మేరీ జాన్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌..

అన్ని హంగులు పూర్తి చేసుకున్న బంబై మేరీజాన్‌ సెప్టెంబ‌ర్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. ఎక్సెల్‌ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించిన బంబై మేరీజాన్‌ సిరీస్‌ లో కృతికా కమ్రా, నివేదిత భట్టాచార్య, అమైరా దస్తూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ప్రస్తుతానికి హిందీలో మాత్రమే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేస్తారా? లేదా? అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

‘బంబై మేరీ జాన్’ ట్రైలర్

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న లేటెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్ లివే..

బంబై మేరీ జాన్ అనౌన్స్ మెంట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!