Pavitra Lokesh- Naresh: పవిత్రా లోకేష్ నరేశ్‌ను ముద్దుగా అలా పిలుస్తుందా? టీవీ షోలో సందడి చేసిన జంట

ప్రస్తుతం సహాజీవనంలో ఉన్న వీరిద్దరూ చాలా రోజుల తర్వాత ఓ టీవీ షోలో కనిపించారు. కొత్త జంటలా కనిపించి సందడి చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ నిర్వహించిన స్పెషల్‌ ప్రోగ్రాంలో నరేష్, పవిత్రా లోకేష్‌ సందడి చేశారు. సార్‌ సినిమాలోని 'మాస్టారూ మాస్టారూ' పాటకు డ్యాన్స్‌ వేస్తూ ముద్దులు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరికున్న ప్రేమను చాటుకున్నారు.

Pavitra Lokesh- Naresh: పవిత్రా లోకేష్ నరేశ్‌ను ముద్దుగా అలా పిలుస్తుందా? టీవీ షోలో సందడి చేసిన జంట
Pavitra Lokesh, Naresh
Follow us
Basha Shek

|

Updated on: Sep 05, 2023 | 8:40 PM

సీనియర్‌ నటీనటులు వీకే నరేష్‌, పవిత్రా లోకేశ్‌ గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి కూడా చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతో మూడో భార్య వ్యవహారం వివాదంగా మారడంతో పెళ్లిపై ముందడుగు వేయలేకపోయారు. పవిత్ర లోకేష్‌- నరేశ్‌ల జీవితంలోని వాస్తవ సంఘటలను ఆధారంగా చేసుకునే మళ్లీ పెళ్లి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సీనియర్‌ దర్శక నిర్మాత ఎం ఎస్‌ రాజు తెరకెక్కించిన ఈ మూవీ టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. నరేష్‌ మూడో భార్య మళ్లీ పెళ్లీ సినిమాపై కోర్టు మెట్లేక్కారు. ఆ తర్వాత ఓటీటీ రిలీజ్‌ను కూడా ఆపేయాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో గత కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు నరేశ్‌- పవిత్రా లోకేష్‌. ప్రస్తుతం సహాజీవనంలో ఉన్న వీరిద్దరూ చాలా రోజుల తర్వాత ఓ టీవీ షోలో కనిపించారు. కొత్త జంటలా కనిపించి సందడి చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ నిర్వహించిన స్పెషల్‌ ప్రోగ్రాంలో నరేష్, పవిత్రా లోకేష్‌ సందడి చేశారు. సార్‌ సినిమాలోని ‘మాస్టారూ మాస్టారూ’ పాటకు డ్యాన్స్‌ వేస్తూ ముద్దులు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరికున్న ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా నరేష్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది పవిత్ర. నరేష్‌ను తాను ముద్దుగా రాయ అని పిలుస్తానంటూ తెలిపింది. అంతకుముందు ‘మళ్లీ పెళ్లి’ ప్రమోషన్‌లో భాగంగా పవిత్రని అమ్ములు అని ముద్దుగా పిలుస్తానని నరేశ్ ఒక సందర్బంలో చెప్పుకొచ్చాడు.

అమ్ములు అని పిలుస్తా..

పవిత్రా లోకేష్‌- నరేశ్‌లకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది నరేష్‌ నటించిన సినిమాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ ఏడాదిలో అన్నీ మంచి శకునములే, మళ్లీ పెళ్లి, సామజవరగమన వంటి హిట్‌ సినిమాల్లో నటించారు నరేష్‌. ప్రస్తుతం రామ్ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌లో ఓ కీ రోల్‌ పోషిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్ యాక్షన్‌ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మళ్లీ పెళ్లి సినిమాలో పవిత్రా లోకేష్- నరేశ్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం