AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhola Shankar OTT: ఈ నెలలోనే ఓటీటీలోకి రానున్న ‘భోళాశంకర్‌’! మెగాస్టార్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్‌ హిట్‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్‌. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్‌ చిరంజీవి చెల్లెలిగా నటించింది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా కనిపించింది. అక్కినేని సుశాంత్‌ మరో కీలక పాత్రలో మెరిశాడు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి అడుగుపెట్టిన భోళాశంకర్‌ సినిమా అభిమానులను బాగా నిరాశపరిచింది.

Bhola Shankar OTT: ఈ నెలలోనే ఓటీటీలోకి రానున్న 'భోళాశంకర్‌'! మెగాస్టార్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Bhola Shankar
Basha Shek
|

Updated on: Sep 05, 2023 | 9:13 PM

Share

వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్‌ హిట్‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్‌. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్‌ చిరంజీవి చెల్లెలిగా నటించింది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా కనిపించింది. అక్కినేని సుశాంత్‌ మరో కీలక పాత్రలో మెరిశాడు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి అడుగుపెట్టిన భోళాశంకర్‌ సినిమా అభిమానులను బాగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. అయితే ఎప్పటిలాగే చిరంజీవి తనదైన నటన, మేనరిజమ్స్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించాడు. సినిమాలో ఆయన స్టైల్‌, డ్యాన్స్‌, యాక్షన్‌, మేనరిజమ్స్‌ అదిరిపోయాయి. అయితే కథ, కథనాల్లో పస లేకపోవడంతో చిరంజీవి శ్రమ అంతా వృథా అయిపోయింది. సుమారు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన భోళా శంకర్‌ ఓ మోస్తరు వసూళ్లతో మాత్రమే సరిపెట్టుకుంది. కాగా సినిమా థియేటర్లలో రిలీజై నెలరోజులు సమీపిస్తోంది. మెగాస్టార్‌ సినిమా కంటే ముందు వచ్చిన రజనీ జైలర్‌ సెప్టెంబర్‌ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి భోళాశంకర్‌ ఓటీటీ రిలీజుపైనే ఉంది. రిజల్ట్‌ తేడా కొట్టడంతోమెగా మూవీ ముందుగానే ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లేనని తేలిపోయింది. భోళాశంకర్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

భోళాశంకర్‌ సినిమా ఈ నెలలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 15న లేదా స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. ఒకవేళ ఈ తేదీకి రాకపోతే సెప్టెంబర్‌ 22న ఓటీటీలోకి అందుబాటులోకి రానుందట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన భోళాశంకర్‌ సినిమాలో శ్రీముఖి, రష్మీ గౌతమ్‌, మురళీ శర్మ, రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, గెటప్ శీను తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ ఫొటో..

చిరంజీవి ఇంట్లో రక్షా బంధన్ వేడుకలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెబుతాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెబుతాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
శాఖాహారుల్లోనే జుట్టు రాలే సమస్య ఎక్కువ, ఎందుకో తెలుసా?
శాఖాహారుల్లోనే జుట్టు రాలే సమస్య ఎక్కువ, ఎందుకో తెలుసా?
'కులం చుట్టూ తిరిగే.. హార్డ్‌ హిట్టింగ్ సినిమా ఇది'
'కులం చుట్టూ తిరిగే.. హార్డ్‌ హిట్టింగ్ సినిమా ఇది'
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..