Maya Petika OTT: ఓటీటీలోకి ‘మాయాపేటిక’.. విరాజ్‌ , పాయల్‌ల మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విరాజ్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌ తో కెరీర్‌ ఆరంభించిన అతను 'అనగనగా ఓ ప్రేమ కథ'తో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అనసూయ థ్యాంక్యూ బ్రదర్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బేబీ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఇదే కోవలో విరాజ్‌ అశ్విన్‌ నటించిన మరో చిత్రం మాయా పేటిక.

Maya Petika OTT: ఓటీటీలోకి 'మాయాపేటిక'.. విరాజ్‌ , పాయల్‌ల మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
MayaPetika Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 06, 2023 | 7:13 AM

బేబీ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విరాజ్‌ అశ్విన్‌. ఇందులో అతను పోషించిన పాత్రకు మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విరాజ్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌ తో కెరీర్‌ ఆరంభించిన అతను ‘అనగనగా ఓ ప్రేమ కథ’తో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అనసూయ థ్యాంక్యూ బ్రదర్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బేబీ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఇదే కోవలో విరాజ్‌ అశ్విన్‌ నటించిన మరో చిత్రం మాయా పేటిక. రమేశ్‌ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్‌ ఎక్స్‌ 100 ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్, సిమ్రత్‌ కౌర్‌ హీరోయిన్లుగా నటించారు. సునీల్, శ్రీనివాసరెడ్డి, హిమజ, శ్యామల తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 30 న థియేటర్లలో విడుదలైన మాయా పేటిక పెద్దగా ఆడలేదు. కాన్సెప్ట్‌ బాగున్నా సరైన ప్రమోషన్లు లేకపోవడం, రీ రిలీజుల కారణంగా బాక్సాఫీస్‌ వద్ద మోస్తరు కలెక్షన్లు మాత్రమే సాధించింది. సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు నెల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే మాయా పేటిక మాత్రం సుమారు 2 నెలల తర్వాత డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా మాయా పేటిక స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 15 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా పంచుకుంది ఆహా. ‘విరాజ్ అశ్విన్‌, పాయల్ రాజ్ పుత్ నటించిన ‘మాయాపేటిక’. సెప్టెంబరు 15న మన ఆహాలో’ అంటూ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇక మాయాపేటిక కథ సినిమా విషయానికొస్తే.. హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌కు ప్రొడ్యూసర్‌ మొబైల్‌ ఇస్తాడు. ఆ ఫోన్‌ కారణంగా భర్తతో పాయల్‌కు గొడవలు తలెత్తుతాయి. దీంతో ఫోన్‌ను తన అసిస్టెంట్‌కు ఇస్తుంది. అలా చాలా చేతులు మారుతూ చివరకు పాకిస్థాన్‌ చేరుకుంటుంది. మరి ఆ ఫోన్‌ వల్ల విరాజ్‌, సిమ్రత్‌ కౌర్‌, శ్రీనివాసరెడ్డి, పృథ్వీరాజ్‌ల జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో తెలుసుకోవాలంటే మాయా పేటిక చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్ కానున్న మాయా పేటిక

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మాయా పేటిక సినిమా ట్రైలర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.