AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narayana And Co OTT: ఓటీటీలో కడుపుబ్బా నవ్వించే సినిమా.. ‘నారాయణ అండ్ కో’ను ఎక్కడ చూడొచ్చంటే?

ఇప్పుడు మరోసారి హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు సుధాకర్. ఇందులో భాగంగా నారాయణ అండ్‌ ఓ మూవీతో ఇటీవలే మన ముందుకు వచ్చాడు. 'ది తిక్కల్ ఫ్యామిలీ' అనేది ఈ మూవీకి క్యాప్షన్‌. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో దేవీ ప్రసాద్‌, ఆమని, ఆర్తి, సప్తగిరి, అలీ రజా, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందిన ఈ సినిమా జూన్‌30న థియేటర్లలో విడుదలైంది.

Narayana And Co OTT: ఓటీటీలో కడుపుబ్బా నవ్వించే సినిమా.. 'నారాయణ అండ్ కో'ను ఎక్కడ చూడొచ్చంటే?
Narayana And Co Movie
Basha Shek
|

Updated on: Sep 05, 2023 | 3:36 PM

Share

శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధాకర్‌ కొమాకులు. అందులో నాగారాజు పాత్రలో అతను పలికిన డైలాగ్స్‌, యాస అందరినీ ఆకట్టుకున్నాయి. దీని తర్వాత హ్యాంగ్‌ అప్‌, వుందిలే మంచికాలం ముందు ముందునా, కుందనపు బొమ్మ, నువ్వు తోపురా సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే పెద్దగా సక్సెస్‌ కాలేకపోయాడు. దీంతో క్రాక్‌, రాజా విక్రమార్క సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌లో నటించాడు. ఇప్పుడు మరోసారి హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు సుధాకర్. ఇందులో భాగంగా నారాయణ అండ్‌ ఓ మూవీతో ఇటీవలే మన ముందుకు వచ్చాడు. ‘ది తిక్కల్ ఫ్యామిలీ’ అనేది ఈ మూవీకి క్యాప్షన్‌. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో దేవీ ప్రసాద్‌, ఆమని, ఆర్తి, సప్తగిరి, అలీ రజా, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందిన ఈ సినిమా జూన్‌30న థియేటర్లలో విడుదలైంది. మూవీ కాన్సెప్ట్‌ బాగా ఉందని ప్రశంసలు వచ్చినా ప్రమోషన్లు సరిగా లేకపోవడంతో మూవీ పెద్దగా ఆడలేకపోయింది. దీనికి తోడు ఆ సమయంలో థియేటర్లలో భారీ సినిమాలు ఉండడంతో పోటీ ముందు నిలబడలేకపోయింది. అయితే ఇప్పుడీ ‘నారాయణ అండ్‌ కో మూవీ’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.

బెట్టింగ్‌ క్రికెట్‌లో.. నారాయణ అండ్‌ కో సినిమాలో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు సుధాకర్‌ కొమాకుల. శ్రీనివాస్ గొర్రిపూడి ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. నారాయణ (దేవీ ప్రసాద్‌) ఓ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తుంటాడు. ఉన్నట్లుండి అతని బ్యాంకులో చోరీ జరుగుతుంది. ఆ నేరం నారయణపై పడుతుంది. రూ.25 లక్షలు కట్టాల్సి వస్తుంది. దీనికి తోడు అతని కుమారుడు ఆనంద్‌ (సుధాకర్‌ కొమాకుల) క్రికెట్‌ బెట్టింగ్‌ లో భారీగా నష్టపోతాడు. డబ్బుకోసం బెట్టింగ్‌ గ్యాంగ్‌ అతని వెంట పడుతుంటారు. తమ కష్టాలు తీరడం కోసం ఓ రౌడీ ఇచ్చిన డీల్‌కు నారాయణ ఫ్యామిలీ ఒప్పుకుంటుంది. మరి ఆ డీల్‌ ఏమిటి? మరి నారాయణ, ఆనంద్‌, ఇతర కుటుంబ సభ్యులు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారన్నది తెలుసుకోవాలంటే నారాయణ అండ్‌ కో సినిమాను చూడాల్సిందే. మరి థియేటర్లలో ఈ ఫన్‌ ఫుల్‌ మూవీని మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

View this post on Instagram

A post shared by CHILL_FRYDAY (@chill_fryday)

నారాయణ అండ్ కో మూవీ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.